ఆన్ లైన్లో రూ. 500కు బ్యాంకు ఖాతాల వివరాలు అమ్ముతున్న ముఠా అరెస్ట్... కాగ్నిజెంట్, హెచ్డీఎఫ్సీ ఉన్నతాధికారుల హస్తం!
- సీవీవీ సహా అన్ని వివరాలు ఇస్తున్న ముఠా
- అసలు వ్యక్తి పాక్ జాతీయుడు, సహకరిస్తున్న ఇక్కడి వారు
- దందాను బట్టబయలు చేసిన మధ్యప్రదేశ్ పోలీసులు
తమకందిన ఫిర్యాదులపై విచారణలో భాగంగా, ఓ కస్టమర్ రూపంలో ఇండోర్ కు చెందిన మహిళ డెబిట్ కార్డు వివరాలను కోరి, ఆ వివరాలు ఇస్తే బిట్ కాయిన్స్ ఇస్తామని చెప్పగా, ఇద్దరు వ్యక్తులు ట్రాప్ లో పడ్డారని, వారిని ముంబైలో అరెస్ట్ చేయగా మొత్తం దందా బయటకు వచ్చిందని పోలీసులు తెలిపారు. ఆగస్టు 28న జైకిషన్ గుప్తా అనే వ్యక్తి తన డెబిట్ కార్డు నుంచి రూ. 72,401 పోయాయని ఇచ్చిన ఫిర్యాదుపై విచారించగా, ఈ వివరాలు తెలిశాయని అన్నారు. ఈ కార్డుతో ముంబైకి చెందిన ఇద్దరు వ్యక్తుల పేర్లపై విమానం టికెట్లు కొన్నారని, అదే కేసు ఛేదించేందుకు కీలక సమాచారాన్ని ఇచ్చిందని అన్నారు.