akshara hassan: ఈ ఇద్దరిలో ఒకరికి 'అర్జున్ రెడ్డి' తమిళ రీమేక్ లో హీరోయిన్ గా ఛాన్స్!

షార్ట్స్‌లో చూడండి
తెలుగులో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న 'అర్జున్ రెడ్డి' .. ఇతర భాషలకి చెందిన దర్శక నిర్మాతలను .. హీరోలను ఆకర్షించింది. దాంతో ఆయా భాషల్లో ఈ సినిమాను రీమేక్ చేయడానికి వాళ్లంతా ఉత్సాహాన్ని చూపుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాను తమిళంలోను రీమేక్ చేస్తున్నారు.

 సీనియర్ స్టార్ హీరో విక్రమ్ తనయుడు 'ధృవ్' ఈ సినిమాలో కథానాయకుడిగా నటించనున్నాడు. తమిళ తెరకి ఈ సినిమాతోనే ఆయన పరిచయమవుతున్నాడు. బాల దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో కథానాయిక ఎవరనే ఆసక్తి అందరిలో తలెత్తుతోంది. కథానాయిక పాత్ర కోసం అక్షర హాసన్ .. 'నిర్మలా కాన్వెంట్' అమ్మాయి శ్రియా శర్మ పేర్లను పరిశీలిస్తున్నారట. ఈ ఇద్దరిలో ఒకరిని ఎంపిక చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు. మరి ఈ ఇద్దరిలో ఆ ఛాన్స్ ఎవరికి దక్కుతుందనేది త్వరలోనే తేలుతుంది.  
Go Back to Shorts
akshara hassan

More Telugu News