వంద మందిలో ఉన్నా ఒంటరినే.. అవిక గోర్ భావోద్వేగ పోస్ట్

Avika Gor emotional post about feeling alone even among a hundred people
  • కెరీర్‌పై దృష్టి పెట్టడం వల్ల బంధాలు దూరమయ్యాయని ఆవేదన
  • ఇప్పుడు తనను చేర్చుకునేందుకు ఎవరూ సిద్ధంగా లేరని పోస్ట్
  • అవిక గోర్ మాటలు సోషల్ మీడియాలో వైరల్
'బాలికా వధు' (తెలుగులో చిన్నారి పెళ్లి కూతురు) సీరియల్‌తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుని, పలు విజయవంతమైన తెలుగు చిత్రాల్లో నటించిన నటి అవిక గోర్.. ఒంటరితనంపై సోషల్ మీడియాలో ఓ భావోద్వేగ పోస్ట్ చేశారు. తన చుట్టూ ఎంతో మంది ఉన్నప్పటికీ తాను ఎదుర్కొంటున్న మానసిక ఒంటరితనం గురించి ఆమె పంచుకున్న మాటలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

"ఒంటరితనం అంటే ఎప్పుడూ ఒంటరిగా ఉండటం మాత్రమే కాదు. వంద మంది తెలిసినా, మనకు చోటెక్కడుందో తెలియకపోవడం కూడా ఒంటరితనమే" అని ఆమె తన పోస్ట్‌లో పేర్కొన్నారు. "ఇప్పటికే ఏర్పడిన స్నేహితుల బృందాల్లో చేరేందుకు ప్రయత్నించడం చాలా అలసటగా ఉంటుంది. కెరీర్‌కే నా జీవితాన్ని అంకితమిచ్చాను. కాలం గడిచేకొద్దీ బంధాలను నిలబెట్టుకోవడం ఎంత కష్టమో ఆలస్యంగా గ్రహించాను" అని ఆమె వివరించారు.

"ఇప్పుడు మనం స్నేహం కోసం సిద్ధంగా ఉన్నా, అప్పటికే అందరూ వారి సొంత గ్రూపులు ఏర్పాటు చేసుకున్నారు. దీంతో అందరూ తెలిసినా, ఎక్కడికీ చెందని వారిలా మిగిలిపోతాం. నన్ను చేర్చుకోవడానికి ఎవరూ సిద్ధంగా లేరు" అని అవిక తన ఆవేదనను వ్యక్తం చేశారు.

కెరీర్‌కు అధిక ప్రాధాన్యత ఇవ్వడం వల్ల వ్యక్తిగత సంబంధాలు ఎలా ప్రభావితమవుతాయో అవిక మాటలు స్పష్టం చేస్తున్నాయి. చాలా మంది అనుభవించే ఇలాంటి భావాలను ఆమె ధైర్యంగా పంచుకోవడం గమనార్హం. ప్రస్తుతం ఆమె చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Advertisement
Avika Gor
Balika Vadhu actress
Avika Gor emotional post
Chinnari Pelli Koothuru star
Avika Gor loneliness post
Celebrity mental health

More Telugu News