డిప్రెషన్ లో యాక్సిడెంట్ చేసిన హీరో రాజశేఖర్... మద్యం తాగలేదన్న పోలీసులు!
- రోడ్డుపై కారును అడ్డదిడ్డంగా నడుపుతూ యాక్సిడెంట్ చేసిన రాజశేఖర్
- మద్యం తాగలేదని నిర్ధారించిన పోలీసులు
- ఇటీవల తల్లి మరణించడంతో డిప్రెషన్ లో ఉన్న రాజశేఖర్
అయితే, తాను మద్యం తాగలేదని, కొంచెం ఒత్తిడిలో ఉన్నానని రాజశేఖర్ తెలిపారు. కావాలంటే టెస్టు చేసుకోవాలని ఆయన ముందుకొచ్చారు. దీంతో రాజేంద్రనగర్ పోలీసులు ఆయనకు బ్రీత్ ఎనలైజర్ పరీక్ష చేశారు. ఇందులో ఆయన మద్యం తాగలేదని నిర్ధారణ అయింది. చివరికి బాధితుడు రాంరెడ్డి కూడా రాజీకి రావడంతో పోలీసులు సమస్యను పరిష్కరించి, రాజశేఖర్ ను వదిలేశారు. ఇంతలో ఆయన భార్య జీవిత వచ్చి, తన తల్లి ఇటీవల మరణించడంతో రాజశేఖర్ డిప్రెషన్ లో కూరుకుపోయారని, దీంతోనే యాక్సిడెంట్ జరిగి ఉంటుందని వివరణ ఇచ్చారు.