ఇంకెలాంటి కామెంట్లు పెడతారోనని భయపడ్డ పాండ్య.. అందుకే సీక్రెట్ చెప్పేశాడు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఇంకెలాంటి కామెంట్లు పెడతారోనని భయపడ్డ పాండ్య.. అందుకే సీక్రెట్ చెప్పేశాడు!

  • పరిణీతి చోప్రా ఫోటోకు కామెంట్ పెట్టడంతో పాండ్యపై రూమర్లు
  • యువతితో కలిసి సెల్పీ దిగిన పాండ్య
  • యువతి ఎవరంటూ ఆరాలు తీసిన అభిమానులు, నెటిజన్లు
  • యువతి నా సోదరి అంటూ సీక్రెట్ రివీల్ చేసిన పాండ్య
టీమిండియా ఆటగాడు హార్దిక్‌ పాండ్య ఓ యువతితో కలిసి దిగిన సెల్పీని సోషల్ మీడియాలో పోస్టు చేసిన సంగతి తెలిసిందే. పాండ్య ఫొటో పెట్టిన వెంటనే నెటిజన్లు వేగంగా స్పందించారు. ప్రేమలో పడ్డావా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఎవరా అమ్మాయి? అంటూ ఆరాలు తీయడం ప్రారంభించారు. మరికొందరు మరికొంచెం ముందుకు వెళ్లి ‘పాండ్య త్వరగా ఆ గుడ్‌ న్యూస్‌ ఏంటో చెప్పెయ్‌’ అంటూ కామెంట్ల వర్షం కురిపించారు.

దీంతో ఇంకెలాంటి కామెంట్లు పెడతారోనని ఆందోళన చెందిన పాండ్య... సీక్రెట్ రివీల్ చేశాడు. ‘మిస్టరీ వీడింది. ఆమె నా సోదరి’ అంటూ అభిమానుల ఉత్సాహాన్ని నీరుగార్చేశాడు. కాగా, ఈ మధ్య బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా పోస్ట్ చేసిన సైకిల్ ఫోటోకు కామెంట్ పెట్టిన పాండ్య వూహాగానాలకు ఊతమిచ్చిన సంగతి తెలిసిందే. దీంతో పరిణీతి ముందుకొచ్చి, తనకు పాండ్య తెలియడని వివరణ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పాండ్య ఫోటో పెట్టడంతో అభిమానులు వారిని అపార్థం చేసుకున్నారు. 
hardik pandya
selfee
pandya with beauty
sister

More Telugu News