sunil: 'ఉంగరాల రాంబాబు' ఫ్లాప్ కి సునీల్ కారకుడా?

షార్ట్స్‌లో చూడండి
హాస్యంతో పాటు మిగతా రసాలను సునీల్ అద్భుతంగా పోషించగలడు. పాత్రలో ఒదిగిపోవడం కోసం ఆయన ఎంతలా కష్టపడతాడనే విషయాన్ని గతంలో కొన్ని సినిమాలు నిరూపించాయి. ఇక డాన్స్ లోను .. ఫైట్స్ లోను ఆయన తన సత్తా చాటుకున్నాడు. అలాంటి సునీల్ కారణంగానే 'ఉంగరాల రాంబాబు' సినిమా ప్లాప్ అయిందనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది.

 ఈ సినిమా దర్శకుడు క్రాంతిమాధవ్ ఇంతకుముందు తెరకెక్కించిన సినిమాలు ప్రేక్షకుల నుంచి అభినందనలు తెచ్చిపెట్టాయి. అలాంటిది ఈ సినిమా మాత్రం అందరినీ నిరాశ పరిచింది. అందుకు కారణం స్క్రిప్ట్ విషయంలో సునీల్ జోక్యం చేసుకోవడమేనని చెప్పుకుంటున్నారు. గతంలో సునీల్ పై ఎప్పుడూ ఇలాంటి వార్తలు షికారు చేయలేదు. కానీ ఈ సినిమా విషయంలో ఈ ప్రచారం మాత్రం జోరుగా జరుగుతోంది. ఇందులో వాస్తవమెంతో చూడాలి మరి. 
Go Back to Shorts
sunil
miyageorge

More Telugu News