నిర్మాతకు హ్యాండిచ్చి చిక్కుల్లో పడ్డ హీరోయిన్ లావణ్యా త్రిపాఠి!
తమిళంలో రీమేక్ అవుతున్న 100% లవ్
షూటింగ్ కు వెళ్లకుండా నిర్మాతను ఇబ్బంది పెట్టిన లావణ్య
సినీ వాణిజ్య మండలిలో ఫిర్యాదు
చిత్రంలో కొంతభాగం షూటింగ్ ను లండన్ లో జరపాలని భావించిన యూనిట్, మొత్తం ప్లాన్ చేసుకున్న తరువాత, బయలుదేరేముందు లావణ్య హ్యాండిచ్చిందట. దీంతో తమకు తీవ్ర నష్టం వాటిల్లిందంటూ దక్షిణ భారత సినీ వాణిజ్య మండలిలో చంద్రమౌళి ఫిర్యాదు చేశారు. లావణ్య బాధ్యతారాహిత్యంతో నష్టపోయామని, ఆమెపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ తాజా గొడవ నుంచి లావణ్య ఎలా బయట పడుతుందో మరి!