మేఘా ఆకాశ్ కి కూడా ఛాన్సులు తన్నుకొస్తున్నాయ్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మేఘా ఆకాశ్ కి కూడా ఛాన్సులు తన్నుకొస్తున్నాయ్!

మలయాళీ భామ మేఘా ఆకాశ్ తెలుగు తెరకి 'లై' సినిమా ద్వారా పరిచయం అయింది. ఈ సినిమా భారీ పరాజయాన్ని చవిచూసింది. అయినా నితిన్ తదుపరి సినిమాలోను ఈ అమ్మాయి ఛాన్స్ కొట్టేసింది. ప్రస్తుతం ఈ సినిమా .. షూటింగ్ దశలో వుంది. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే మేఘా ఆకాశ్ మరో సినిమాలో అవకాశాన్ని దక్కించుకుంది .. అదే మారుతి సినిమా.

 దర్శకుడు మారుతి .. చైతూ కథానాయకుడిగా ఒక సినిమాను తెరకెక్కించడానికి రంగాన్ని సిద్ధం చేస్తున్నాడు. ఈ సినిమాలో కథానాయికగా పూజా హెగ్డే ను తీసుకోవాలని అనుకున్నాడు. అయితే చైతూతో తాను చేయనున్న సినిమా కోసం అప్పటికే ఆమెను చందూ మొండేటి సంప్రదించాడట. దాంతో ఒకరిద్దరు పేర్లను పరిశీలించిన మారుతి, చివరికి మేఘా ఆకాశ్ ను కథానాయికగా ఎంచుకున్నాడట. మిగతా వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.   
chaitu
megha akash

More Telugu News