కోపంతో లావణ్య త్రిపాఠి ఆ సినిమాను కూడా వదులుకుందట!
ఈ సినిమాతో పాటు ఆమె చంద్రమౌళి దర్శకత్వంలో '100% లవ్' తమిళ రీమేక్ చేయడానికి కూడా ఒప్పుకుంది. అయితే పరశురామ్ సినిమా వలన ఆమె డేట్స్ సర్దుబాటు చేయలేకపోయిందట. ఈ విషయం తెలుసుకున్న చంద్రమౌళి .. గీతా ఆర్ట్స్ 2 నిర్మాతల్లో ఒకరైన బన్నీ వాసుకి ఫోన్ చేసి, వాళ్ల సినిమాను లావణ్య చేయడం లేదని చెప్పేశాడట. దాంతో వాళ్లు రష్మిక మందనను తీసుకున్నారు. ఈ విషయం లావణ్యకి కోపాన్ని తెప్పించడంతో, చంద్రమౌళి సినిమాను కూడా చేయను పొమ్మందట. ఇందులో వాస్తవమెంతో గానీ .. ఇప్పుడిదే హాట్ టాపిక్ గా మారింది.