శింబూతో కలిసి వచ్చేస్తోన్న నయనతార!
సెప్టెంబర్ 8వ తేదీన ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తున్నారు. అదే రోజున చైతూ 'యుద్ధం శరణం' .. అల్లరి నరేశ్ 'మేడమీద అబ్బాయి' సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఈ సినిమాలతో 'సరసుడు' పోటీ పడవలసి ఉంటుంది. ఈ సినిమాకి శింబూ సోదరుడు సంగీతాన్ని అందిస్తే, టి.రాజేందర్ .. శింబూ చెరో పాట పాడటం విశేషం. తెలుగులో నయనతారకి గల క్రేజ్ ఈ సినిమాకి బాగా కలిసొస్తుందని నిర్మాతలు భావిస్తున్నారు.