'లై' మూవీతో నితిన్ ఆశించిన హిట్ దక్కేనా?
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'లై' మూవీతో నితిన్ ఆశించిన హిట్ దక్కేనా?

త్రివిక్రమ్ దర్శకత్వంలో నితిన్ చేసిన 'అ ఆ' ఆయన కెరియర్లోనే భారీ హిట్ గా నిలిచింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు .. ఓవర్సీస్ లోను భారీ వసూళ్లను సాధించిన చిత్రంగా ప్రశంసలు అందుకుంది. దాంతో తన తదుపరి సినిమా కూడా ఆ స్థాయిలో హిట్ కొట్టాలనే ఆలోచనతో, మంచి కథ వచ్చేంతవరకూ నితిన్ వెయిట్ చేశాడు. కొంత గ్యాప్ వచ్చినా బాధ పడకుండా ఆయన హను రాఘవపూడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

అలా ఈ సినిమా ఈ రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 'అ ఆ' సినిమా ఓవర్సీస్ లో 2.49 మిలియన్ డాలర్లను వసూలు చేసింది. అమెరికాలో అత్యధిక వసూళ్లను రాబట్టిన తెలుగు చిత్రాల జాబితాలో నాల్గొవ స్థానాన్ని దక్కించుకుంది. దాంతో ఇప్పుడు అమెరికాలో 'లై' సినిమాను భారీ స్థాయిలోనే విడుదల చేశారు. 'అ ఆ' వసూళ్లను 'లై' మూవీ వసూళ్లు బీట్ చేస్తాయా? నితిన్ ఆశలు నిజమయ్యేనా? అనేది చూడాలి.     
nithin
megha akash

More Telugu News