పబ్లిక్ టాక్: లుక్ పరంగా .. ఫెర్ఫార్మెన్స్ పరంగా నితిన్ అదరగొట్టేశాడు!
ముఖ్యంగా యాక్షన్ సీన్స్ లో నితిన్ తన కెరియర్లోనే బెస్ట్ ఫెర్ఫార్మెన్స్ చూపించాడని అంటున్నారు. కథానాయిక మేఘా ఆకాశ్ .. నితిన్ కాంబినేషన్లో వచ్చే రొమాంటిక్ సీన్స్ యూత్ ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయని చెబుతున్నారు. ఇక విలన్ గా అర్జున్ అద్భుతమైన నటనను కనబరిచాడనీ .. ఆయనతో నితిన్ తలపడే సీన్స్ హైలైట్ గా వున్నాయనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.