'బెస్ట్ ఫుడ్.. బెస్ట్ ఫ్రెండ్స్' అంటున్న త్రిష!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'బెస్ట్ ఫుడ్.. బెస్ట్ ఫ్రెండ్స్' అంటున్న త్రిష!

మొదటి నుంచి కూడా త్రిష కి ఫ్రెండ్స్ సర్కిల్ ఎక్కువే. ఆమె స్నేహితుల్లో ఇటు ఇండస్ట్రీకి చెందిన వాళ్లు .. అటు బయటవాళ్లు కూడా వుంటారు. వాళ్లతో కలిసి సరదాగా గడిపే ఛాన్స్ ను త్రిష ఎంతమాత్రం వదులుకోదు. షూటింగ్ లేని సమయాల్లో వాళ్లందరినీ తీసుకొని ఎక్కడో ఒక చోటుకి విహార యాత్రను ప్లాన్ చేస్తుంటుంది.

 ఫ్రెండ్స్ తో కలిసి ఎంజాయ్ చేసే విషయంలో తన బర్త్ డే మొదలు ఆమె ఏ సందర్భాన్ని వదులుకోదు. అలాంటిది ఇక ఫ్రెండ్షిప్ డే ను వదులుకుంటుందా? నిన్న ఉదయం నిద్ర లేవగానే ఫ్రెండ్స్ ను తన ఇంటికి లంచ్ కి ఆహ్వానించింది. ఆ సాయంత్రం కొంతమంది ఫ్రెండ్స్ తో కలిసి తన ఫేవరేట్ పబ్ కి చేరిపోయింది. ఇక ఫ్రెండ్స్ తో కలిసి అక్కడ ఆమె చేసిన సందడి అంతా ఇంతా కాదట. 'బెస్ట్ ఫుడ్ .. బెస్ట్ ఫ్రెండ్స్' అంటూ ట్వీట్ కూడా చేసేసింది.    
trisha

More Telugu News