బాక్సర్ గా త్రిష దుమ్మురేపేస్తుందట!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బాక్సర్ గా త్రిష దుమ్మురేపేస్తుందట!

 తెలుగులో అగ్రకథానాయికగా త్రిష ఎంతో క్రేజ్ తెచ్చుకుంది. అయితే ఇక్కడి కొత్త కథానాయికల పోటీని తట్టుకోలేక ఆమె కోలీవుడ్ పైనే దృష్టి పెట్టింది. అక్కడ సీనియర్ హీరోయిన్స్ లో నయనతార తరువాత స్థానంలో తనే కొనసాగుతోంది. ప్రస్తుతం ఆమె చేతిలో వున్న 8 సినిమాలే అందుకు నిదర్శనం.

ఇలా వరుసగా విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ ఆమె దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో ఆమె బాక్సింగ్ నేర్చుకుంటోంది. ఓ తమిళ సినిమా కోసం ఆమె బాక్సింగ్ లో ప్రత్యేక శిక్షణ తీసుకుంటోంది. కథా ప్రకారం ఆ సినిమాలో ఆమె బాక్సర్ గా కనిపించనుందట. ఆ పాత్రకి జీవం పోయడం కోసం త్రిష సాధన చేస్తోంది. ఈ పాత్ర తనకి మరింత పేరు తీసుకువస్తుందనే ఆశతో త్రిష వుంది. ఆమె నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందో చూడాలి.
trisha

More Telugu News