sunil: దిల్ రాజు చేతికి 'ఉంగరాల రాంబాబు'?

షార్ట్స్‌లో చూడండి
దిల్ రాజు నుంచి ఒక సినిమా వస్తుందంటే ఆడియన్స్ లో తప్పకుండా దానిపై కొన్ని అంచనాలు ఉంటాయి. ఏ తరహా సినిమా ఏ వర్గం ప్రేక్షకులను అలరిస్తుందనే విషయం దిల్ రాజుకి బాగా తెలుసు. ఏ సినిమాలో ఎక్కడ ఏయే పాళ్లు తగ్గాయనే విషయాన్ని ఆయన వెంటనే గ్రహిస్తారు. అందువలన కొంతమంది దర్శక నిర్మాతలు తమ సినిమాలను ఆయనకి చూపించడం .. ఆయన చేతిలో పెట్టేయడం చేస్తుంటారు.

అలా 'ఉంగరాల రాంబాబు' కూడా ఆయన చేతికి వెళ్లనున్నట్టు చెప్పుకుంటున్నారు. కొంతకాలంగా సునీల్ కి సక్సెస్ అనేదే లేకపోవడంతో అది బిజినెస్ పై ప్రభావం చూపుతోంది. దాంతో ఈ సినిమాను బయటికి తీసుకురావడం కష్టమవుతోందట. ఈ కారణంగా సినిమాను దిల్ రాజు చేతిలో పెట్టాలని దర్శక నిర్మాతలు నిర్ణయించుకున్నారట. త్వరలోనే ఆయనకి ఈ సినిమాను చూపించనున్నారని టాక్ ..  చూశాక ఏ నిర్ణయం తీసుకుంటాడో చూడాలి! 
Go Back to Shorts
sunil

More Telugu News