జల్లికట్టుపై మోదీ సానుకూలంగా స్పందించారు.. ఆర్డినెన్స్ జారీ అవుతుంది: ప‌న్నీర్ సెల్వం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

జల్లికట్టుపై మోదీ సానుకూలంగా స్పందించారు.. ఆర్డినెన్స్ జారీ అవుతుంది: ప‌న్నీర్ సెల్వం

జ‌ల్లిక‌ట్టుకు మ‌ద్ద‌తుగా ఈ రోజు త‌మిళ‌నాడులో పెద్ద ఎత్తున‌ ఆందోళ‌న‌లు కొనసాగుతున్నాయి. మెరీనా బీచ్ వ‌ద్ద పెద్ద సంఖ్య‌లో విద్యార్థులు నిర‌స‌న‌లో పాల్గొన్నారు. ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి ప‌న్నీర్ సెల్వం జ‌ల్లిక‌ట్టు క్రీడ నిర్వ‌హించ‌డానికి ఉన్న అడ్డంకుల‌ను తొల‌గించుకోవ‌డానికి ముమ్మ‌రంగా ప్ర‌య‌త్నాలు జ‌రుపుతున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ... జల్లికట్టు నిర్వహించేందుకు వీలుగా ఒక ఆర్డినెన్స్ ముసాయిదాను సిద్ధం చేసినట్లు చెప్పారు. దాన్ని ఈ రోజు కేంద్ర ప్ర‌భుత్వానికి పంపామని అన్నారు. జల్లికట్టుపై ప్రధాని మోదీ సానుకూలంగా స్పందించారని రెండు రోజుల్లో ఆర్డినెన్స్ జారీ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. త‌మిళ ప్ర‌జ‌లు చేస్తోన్న ఆందోళ‌న‌ల‌ను వెంటనే విరమించాలని ఆయ‌న కోరారు.
jallikattu
panner selvam

More Telugu News