భోగాపురం వద్ద ఘోర‌ రోడ్డు ప్రమాదంపై మంత్రి లోకేశ్ దిగ్భ్రాంతి

Andhra
Advertisement
  • భోగాపురం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం
  • లారీని ఢీకొట్టి కారు దగ్ధం.. నలుగురి మృతి
  • శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం వెళ్తుండగా దుర్ఘటన
  • మృతుల కుటుంబాలకు మంత్రి నారా లోకేశ్ ప్రగాఢ సానుభూతి
విజయనగరం జిల్లా భోగాపురం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సుందరపేట సమీపంలో వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులోని ఐదుగురు వ్య‌క్తుల్లో న‌లుగురు అక్క‌డిక‌క్క‌డే మృతిచెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.

వివరాల్లోకి వెళితే.. శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం వైపు వెళుతున్న కారుకు ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద తీవ్రతకు కారు పూర్తిగా ధ్వంస‌మైంది. ఈ ఘోర ప్ర‌మాదంపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని తీవ్రంగా గాయపడిన వ్యక్తిని మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ దుర్ఘటనతో జాతీయ రహదారిపై విషాద ఛాయలు అలుముకున్నాయి.

ఈ ఘటనపై రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. "భోగాపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృత్యువాత పడటం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. మృతులకు నివాళులర్పిస్తున్నాను. కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను" అని ఆయన పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని లోకేశ్ భరోసా ఇచ్చారు. 
Advertisement

సంబంధిత వార్తలు

Nara LokeshBhogapuram road accidentVizianagaram car accidentAndhra Pradesh road mishapsBhogapuram highway crashVizianagaram news today

More Telugu News

శర్వానంద్‌తో వైరల్ ఫొటోపై డింపుల్ హయతి స్పందన

24 Nov, 11:05

భారత్‌లో భారీ ఉద్యోగ కోతల వార్తలను ఖండించిన గూగుల్.. 'సుమారు 30 పోస్టులే తొలగింపు'

24 Nov, 11:04

శాండ్‌పేపర్‌గేట్ వివాదం: కమిన్స్‌ ఐపీఎల్‌ ఆడతాడా? సహచర ఆటగాడి బిగ్ అప్‌డేట్!

24 Nov, 10:55

జనసేనకు జై కొట్టిన వైసీపీ.. ఎక్కడో కాదు మంత్రి నియోజకవర్గంలోనే!

24 Nov, 10:54

తిరుమల చరిత్రలోనే భారీ విరాళం.. చంద్రబాబు సమక్షంలో రూ. 160 కోట్ల స్వర్ణాభరణాలను సమర్పించనున్న భక్తుడు

24 Nov, 10:46

అత్త గౌరవిస్తే కోడలు ఇలా రాస్తారా?: సోనియా గాంధీకి సావర్కర్ ఫ్యామిలీ లీగల్ నోటీసులు

24 Nov, 10:44

సేవలోనూ ఒక్కటైన టేలర్ స్విఫ్ట్, ట్రావిస్ కెల్సీ.. 20 సంస్థలకు రూ. 241 కోట్ల భారీ విరాళం!

24 Nov, 10:41

భారత్‌తో యుద్ధంలో పాక్‌కు చైనా అండ.. అమెరికా నివేదికలో కీలక విషయాలు!

24 Nov, 10:39

యాప్స్ ద్వారా లోన్ తీసుకుంటున్నారా? ఆర్బీఐ కొత్త నిబంధనలు.. అధిక ఛార్జీలకు చెక్

24 Nov, 10:20

అమరావతిలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన నేడు రెండు కీలక సమావేశాలు

24 Nov, 10:10

ప్రపంచాన్ని కదిలించిన పెలికోట్‌కు మరో షాక్.. దిగ్భ్రాంతికి గురయ్యానన్న బాధితురాలు

24 Nov, 10:08

ఇండోనేసియా క్యాండీ ఫ్యాక్టరీ ప్రమాదంలో 24 మంది మృతి

24 Nov, 10:06

గ్రౌండ్‌లో బుమ్రా ఫన్నీ రియాక్షన్: 'ఎలా పట్టాలిరా బాబూ?'.. వైరల్ అవుతున్న వీడియో!

24 Nov, 09:58

బౌలర్‌పై గిల్‌ అలా అరవడం సరికాదు.. కెప్టెన్ ప్రవర్తనను తప్పుబట్టిన రహానే

24 Nov, 09:46
..More Telugu News