వాటర్ బాటిల్ కొంటున్నారా? బిస్లరీ వివాదం వేళ రంగంలోకి ఎఫ్ఎస్ఎస్ఏఐ.. అన్ని బ్రాండ్ల శాంపిల్స్ టెస్టింగ్!
Advertisement
- మార్కెట్లోని వివిధ ప్యాకేజ్డ్ వాటర్ నుంచి నమూనాల సేకరణ
- నాణ్యతా ప్రమాణాలు తేల్చేందుకు వేగంగా ల్యాబ్ పరీక్షలు
- త్వరలోనే వెలువడనున్న తాజా టెస్టింగ్ ఫలితాలు
- అసలైన బ్రాండ్లను పోలి ఉండే నకిలీ లేబుళ్లపై నిఘా
- తప్పుదోవ పట్టించే కంపెనీలపై చర్యలు ఉంటాయని హెచ్చరిక
ప్రముఖ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ బ్రాండ్ 'బిస్లరీ' వ్యవహారంలో వివాదం రేగిన నేపథ్యంలో భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) దేశవ్యాప్తంగా తన తనిఖీలను మరింత ముమ్మరం చేసింది. కేవలం బిస్లరీకే పరిమితం కాకుండా మార్కెట్లోని అన్ని రకాల బాటిల్ వాటర్ బ్రాండ్లను నిఘా పరిధిలోకి తీసుకొచ్చింది. నాణ్యతా ప్రమాణాలు పాటించని తాగునీటి సరఫరాదారులపై కఠిన చర్యలు తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది.
ఈ ప్రత్యేక తనిఖీ డ్రైవ్‌లో భాగంగా మార్కెట్లో అందుబాటులో ఉన్న వివిధ ప్యాకేజ్డ్ వాటర్ బ్రాండ్ల నుంచి అధికారులు రాండమ్‌గా శాంపిల్స్ సేకరించారు. అంతకుముందు బిస్లరీతో పాటు పలు ఇతర బ్రాండ్ల నమూనాలను కూడా సేకరించి పరీక్షలకు పంపించారు. వీటికి సంబంధించిన తాజా ల్యాబ్ రిపోర్టులు త్వరలోనే రానున్నాయి. ఈ ఫలితాల ఆధారంగా సదరు ఉత్పత్తులు నిర్దేశిత భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయా లేదా అనేది తేలనుంది.
మరోవైపు ప్రముఖ వాటర్ బ్రాండ్ల పేర్లు, లేబుళ్లను పోలి ఉండే నకిలీ బ్రాండ్లపై కూడా ఎఫ్ఎస్ఎస్ఏఐ ప్రత్యేకంగా దృష్టి సారించింది. ప్రజలను తప్పుదోవ పట్టించేలా, అసలైన కంపెనీలను పోలి ఉండే పేర్లు, రంగులతో బాటిళ్లను మార్కెట్లోకి తెస్తున్న సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. తాజా శాంపిల్స్ సేకరణతో దేశీయ ప్యాకేజ్డ్ తాగునీటి మార్కెట్ మొత్తాన్ని ఎఫ్ఎస్ఎస్ఏఐ పూర్తి స్థాయి పర్యవేక్షణలోకి తీసుకువచ్చింది.