ముక్త్ నషా ఈవెంట్ కు ప్రభాస్ ను ఆహ్వానించిన కిషన్ రెడ్డి.. ప్రత్యేక టీషర్ట్‌ల ఆవిష్కరణ

Telangana
Advertisement
  • ప్రభాస్‌తో భేటీ అయిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
  • 'నషా ముక్త్ భారత్' ఉద్యమంలో భాగస్వామ్యం కావాలని ఆహ్వానం
  • 'హైదరాబాద్ వాక్స్' ప్రచార టీషర్ట్‌లను ఆవిష్కరించిన ప్రభాస్
  • మాదకద్రవ్యాల రహిత సమాజం కోసం గళమెత్తాలని పిలుపు
దేశవ్యాప్తంగా మాదకద్రవ్యాల నిర్మూలన లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ‘నషా ముక్త్ భారత్’ ఉద్యమంలో భాగస్వామ్యం కావాల్సిందిగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌కు ఆహ్వానం అందింది. కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి నేడు ప్రభాస్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఇవాళ హైదరాబాద్ లో ప్రభాస్ నివాసానికి వెళ్లిన ఆయన.. కేంద్ర ప్రభుత్వం విస్తృతంగా నిర్వహిస్తున్న డ్రగ్స్ వ్యతిరేక ప్రచారానికి మద్దతు ఇవ్వాలని కోరారు.

సమాజంలో, ముఖ్యంగా యువతలో డ్రగ్స్ వినియోగంపై అవగాహన కల్పించే ఉద్దేశంతో ప్రభాస్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంయుక్తంగా 'హైదరాబాద్ వాక్స్ – నషా ముక్త్ భారత్' (Hyderabad Walks – Nasha Mukt Bharat) కార్యక్రమానికి సంబంధించిన ప్రత్యేక టీషర్ట్‌లను ఆవిష్కరించారు.

దేశాన్ని మాదకద్రవ్యాల రహితంగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలనే ప్రధాన సందేశాన్ని ఈ ప్రచారం చాటిచెబుతోంది. ఈ సందర్భంగా "మాదకద్రవ్యాల రహిత భారత్ కోసం మనమందరం గళమెత్తుదాం!" అంటూ పిలుపునిచ్చారు. యువతలో విపరీతమైన అభిమానం ఉన్న ప్రభాస్ వంటి అగ్ర నటుడు ఈ అవగాహన ఉద్యమానికి మద్దతు తెలపడం ద్వారా సమాజంలో మరింత సానుకూల ప్రభావం పడుతుందని భావిస్తున్నారు.
Advertisement

సంబంధిత వార్తలు

PrabhasKishan ReddyNasha Mukt BharatHyderabad WalksDrug Free SocietyUnion Minister Kishan Reddy

More Telugu News

కాల్పుల ఘటన తర్వాత తొలిసారిగా బయటికొచ్చిన టైగర్ ష్రాఫ్

22 Nov, 16:54

జర్మనీలో నైపుణ్యం కలిగిన కార్మికులను ఎంత గౌరవిస్తారో నాకు తెలుసు: నారా లోకేశ్

22 Nov, 16:47

25 కేజీలు కాకుండా 26 కేజీల బియ్యం బస్తాల వెనుక ఉన్న అసలు కారణమిదే!

22 Nov, 16:47

అల్లు సినిమాస్‌లో టికెట్లు బ్లాక్..? వెంటనే స్పందించిన అల్లు అరవింద్

22 Nov, 16:28

దోహాలో భారత్ ఎ, పాక్ ఎ జట్ల సమరం.. టాస్ సమయంలో గందరగోళం.. వీడియో ఇదిగో!

22 Nov, 16:20

15 ఏళ్లకే సంపాదన మొదలుపెట్టి 3బీహెచ్‌కే ఫ్లాట్ కొన్న ఐటీ ఉద్యోగిని కథ!

22 Nov, 16:06

భారత పాస్‌పోర్ట్‌తో ఇప్పుడు ఎన్ని దేశాలకు వీసా లేకుండా వెళ్లవచ్చో తెలుసా?

22 Nov, 15:54

నైట్ షిఫ్ట్ చేసేవారికి హెచ్చరిక.. గుండె నిర్మాణమే మారిపోతుందని అధ్యయనంలో వెల్లడి

22 Nov, 15:46

మరింత క్వాలిటీ కోసం.. రష్మిక మందన్న 'మైసా' విడుదల వాయిదా

22 Nov, 15:37

పంచాయతీ ఎన్నికల్లో పంతాలకు పోవద్దు: సీఎం చంద్రబాబు దిశానిర్దేశం

22 Nov, 15:22

బంగారం కంటే అయోధ్య భూములే మేలా.. ఎందులో ఎక్కువ లాభాలు?

22 Nov, 15:12

ఒప్పందం కంటే ముందే ప్రాజెక్టు పూర్తి.. అయినా కెనడా బిల్డర్ కు ఎదురుదెబ్బ.. ఎందుకంటే..!

22 Nov, 15:00

తెలంగాణ వెటర్నరీ వర్సిటీలో అధ్యాపక పోస్టుల భర్తీకి సర్కార్ అనుమతి.. ఈ నెలాఖరులోగా నోటిఫికేషన్!

22 Nov, 14:48

సిద్ధిపేట 'సదర్'లో హరీశ్ రావు జోష్.. ఫొటోలు ఇవిగో!

22 Nov, 14:38
..More Telugu News