చంద్రబాబు మూల్యం చెల్లించుకోక తప్పదు: సీపీఐ రామకృష్ణ

Andhra
Advertisement
  • ఏపీ స్థానిక ఎన్నికల్లో దౌర్జన్యాలు విపరీతంగా పెరిగిపోయాయని రామకృష్ణ
  • ఎన్నికల్లో పోటీ చేయలేని పరిస్థితులు నెలకొన్నాయని ఆరోపణ
  • పాలకపక్ష నేతల కంటే పోలీసుల బెదిరింపులే అధికంగా ఉన్నాయని విమర్శ
ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార దుర్వినియోగం, దౌర్జన్యాలు తీవ్రస్థాయికి చేరాయని సీపీఐ నేత రామకృష్ణ ఆరోపించారు. ఏపీలో ప్రస్తుతం స్థానిక ఎన్నికల్లో విపక్షాలు కనీసం పోటీ కూడా చేయలేని పరిస్థితి ఏర్పడిందని మండిపడ్డారు. ప్రజాస్వామ్యబద్ధంగా సాగాల్సిన ఎన్నికల్లో దౌర్జన్యం పెరిగిపోయిందని, ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు హయాంలోనే జరుగుతుండటంతో ఆయన రాజకీయ జీవితానికి మాయని మచ్చగా మిగిలిపోతుందని పేర్కొన్నారు. కర్నూలులో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

"అధికార పార్టీ నేతల కంటే పోలీసుల ఎక్కువ బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతున్నారు. ఈ ఎన్నికలు చంద్రబాబుకు మచ్చగా తయారయ్యాయి. దీనికి చంద్రబాబు మూల్యం చెల్లించుకోక తప్పదు. ఏపీలో ఓటు హక్కు కోసం ఎన్నికల నిర్వహణపై ప్రజలు ఉద్యమాలు చేయాలి. డబ్బులు చెల్లిస్తే ఓటు వేసే సంస్కృతిని ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఎన్నికల్లో డబ్బు, దౌర్జన్యాలతో ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంగా మార్చారు" అని ఆరోపించారు.

ఓటు హక్కు పరిరక్షణ కోసం, నిష్పాక్షిక ఎన్నికల నిర్వహణ కోసం ప్రజలు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఎన్నికలు ముగిసిన తర్వాత చోటుచేసుకున్న దాడులు, దౌర్జన్యాలపై సీపీఐ ఆధ్వర్యంలో మేధావులతో ప్రత్యేక చర్చా వేదికలు, సభలు నిర్వహించి ప్రజల్లో చైతన్యం తెస్తామని వెల్లడించారు.
Advertisement

సంబంధిత వార్తలు

CPI RamakrishnaChandrababu NaiduAndhra Pradesh local electionsAndhra Pradesh politics

More Telugu News

సల్మాన్ ఖాన్ నుంచి ఐశ్వర్యా రాయ్‌ను కాపాడేందుకే నన్ను పెట్టారు: కేతన్ కరాండే

21 Nov, 18:13

తొలి టెస్టుకు సిరాజ్‌ను పక్కన పెట్టడంపై తెలంగాణ మంత్రి అజహరుద్దీన్ అసంతృప్తి

21 Nov, 18:08

ఆసియాలోనే అతి పెద్ద రిలయన్స్ పానీయాల ఫ్యాక్టరీ.. ఓర్వకల్లు వేదికగా కాంపా కోలా ప్రస్థానం మళ్లీ మొదలైంది: లోకేశ్

21 Nov, 17:44

నాకు రూ. 500 కోట్ల ఆస్తి లేదు.. అద్దె ఇంట్లోనే ఉంటున్నా: అనుపమ్ ఖేర్

21 Nov, 17:43

నెల్లూరు కార్పొరేషన్ చివరి సమావేశంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి కీలక వ్యాఖ్యలు

21 Nov, 17:25

మార్కెట్ నుంచి టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్ ఔట్.. వెబ్‌సైట్ నుంచి తొలగించిన కంపెనీ!

21 Nov, 17:22

రైలు బోగీలో మహిళపై హత్యాచారం.. నిందితుడ్ని పట్టించిన పాము ఆకారపు ఉంగరం

21 Nov, 17:19

కొత్త పింఛన్లపై సీఎం రేవంత్‌కు కౌశిక్ రెడ్డి రాజీనామా సవాల్

21 Nov, 17:04

శాండ్‌పేపర్ వివాదం.. ఆ చీకటి రోజుల్లోకి మళ్లీ వెళ్లలేను: డారెన్ లీమన్

21 Nov, 17:01

'ఆపరేషన్ సిందూర్‌' వేళ పాక్‌కు చైనా రహస్య సాయం.. అమెరికా నివేదికలో బండారం బట్టబయలు!

21 Nov, 16:56

బెంగళూరు ప్యాలెస్ లోకి షర్మిల ప్రవేశించకుండా కోర్టును ఆశ్రయించిన జగన్!

21 Nov, 16:52

పార్టీ లైన్ దాటితే చర్యలు తప్పవు.. రాజగోపాల్ రెడ్డి, అనిరుధ్ రెడ్డి వ్యాఖ్యలపై మహేశ్ గౌడ్ స్పందన

21 Nov, 16:47

రూ.5 వేలకే మ‌ర్డ‌ర్లు.. పంజాబ్‌లో పోలీసుల హత్యల వెనుక ఐఎస్ఐ.. బయటపడ్డ షాకింగ్ నిజాలు!

21 Nov, 16:36

ఉమామహేశ్వరుల అంతరార్థం అదే.. రాహుల్, ప్రియాంకలకు హిందూ గురువు హితబోధ

21 Nov, 16:34
..More Telugu News