నేటి సాయంత్రం 5 గంటలకు భారీ ప్రకటన ఉంటుంది.. అదేంటో చెప్పగలరా?: నారా లోకేశ్
Advertisement
- ఏపీలో ఏర్పాటైన ఆసియాలోనే అతిపెద్ద బెవరేజ్ తయారీ ప్లాంట్
- కేవలం 12 నెలల రికార్డు సమయంలోనే ప్లాంట్ నిర్మాణం పూర్తి
- 10 ప్రొడక్షన్ లైన్లతో వేలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు
- కంపెనీ పేరు లొకేషన్ వివరాలు సాయంత్రం వెల్లడించనున్న మంత్రి
ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగంలో సరికొత్త రికార్డు నమోదైంది. రాష్ట్రంలో ఒక భారీ ప్రాజెక్టును అత్యంత వేగంగా పూర్తి చేసినట్లు వెల్లడించిన రాష్ట్రమంత్రి నారా లోకేశ్ వెల్లడించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలతో నేడు సాయంత్రం 5 గంటలకు ఒక భారీ ప్రకటన చేయబోతున్నట్టు సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ఆసియాలోనే అతిపెద్ద పానీయాల (బెవరేజ్) తయారీ ప్లాంట్‌ను ఆంధ్రప్రదేశ్‌లో విజయవంతంగా నెలకొల్పినట్లు ఆయన ప్రకటించారు. అయితే ఆ దిగ్గజ సంస్థ ఏది? ఎక్కడ ఏర్పాటు చేశారు? ఎంత పెట్టుబడి వచ్చింది? అనే ప్రశ్నలకు సమాధానాలు ఊహించగలరా? అంటూ లోకేశ్ తన ప్రకటనలో పేర్కొన్నారు.
సాధారణంగా ఇలాంటి భారీ అంతర్జాతీయ స్థాయి ప్రాజెక్టుల ఏర్పాటుకు వివిధ రకాల అనుమతులు సాధించడం, మౌలిక వసతుల కల్పన, యంత్రాల అమరిక వంటి పనులన్నింటికీ కనీసం 2 నుంచి 3 సంవత్సరాల సమయం పడుతుంది. కానీ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పారిశ్రామిక అనుమతులను అత్యంత వేగవంతం చేయడంతో, కేవలం 12 నెలల రికార్డు సమయంలోనే ఈ ప్లాంట్ నిర్మాణం పూర్తయి ఉత్పత్తికి సిద్ధమైంది. భూమి పూజ చేసిన నాటి నుంచి ప్రాజెక్ట్ ప్రారంభం వరకు పట్టిన కాలాన్ని ప్రస్తావిస్తూ.. ఇదే నిజమైన 'స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' అని మంత్రి లోకేశ్ స్పష్టం చేశారు.
ఈ ప్రతిష్టాత్మక ప్లాంట్‌లో మొత్తం 10 ప్రొడక్షన్ లైన్లు ఉన్నట్లు మంత్రి వెల్లడించారు. ఈ భారీ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలోని వేలాది మంది యువతకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ప్లాంట్ పూర్తి స్థాయి వివరాలను ప్రస్తుతానికి సస్పెన్స్‌లో ఉంచడంతో, ఆ అంతర్జాతీయ బ్రాండ్ ఏమై ఉంటుందనే అంశంపై సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ జరుగుతోంది. రాష్ట్రానికి వచ్చిన ఆ బహుళజాతి సంస్థ ఏంటనేది తెలుసుకోవడానికి ప్రజలు, పారిశ్రామిక వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఈ నేపథ్యంలో నేడు సాయంత్రం 5 గంటలకు మంత్రి నారా లోకేశ్ చేయనున్న అధికారిక ప్రకటన అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది.