కూలీ పనుల నుంచి శాస్త్రవేత్త స్థాయికి.. కన్నీళ్లను గెలిచిన యువకుడి అద్భుత ప్రస్థానం!
Advertisement
- కూలీ పనులు చేస్తూ చదువుకున్న తమిళనాడు విద్యార్థి కర్ణన్
- శివగంగై జిల్లా వ్యవసాయ కుటుంబం నుంచి ఎదిగిన వైనం
- 2019లో లభించిన ఎన్‌ఎఫ్‌ఎస్‌సీ జాతీయ ఫెలోషిప్ సహాయం
- రూ.16 లక్షల ఆర్థిక సహకారంతో పూర్తయిన పీహెచ్‌డీ పరిశోధనలు
- అంతర్జాతీయ పరిశోధన జర్నల్స్‌లో ఆరు పరిశోధనా పత్రాల ప్రచురణ
ఒకప్పుడు చదువుకయ్యే ఖర్చుల కోసం సెలవుల్లో కూలీ పనులకు వెళ్లిన ఆ యువకుడు.. నేడు దేశం గర్వించే ప్రతిష్ఠాత్మక పరిశోధనా సంస్థలో శాస్త్రవేత్తగా స్థిరపడ్డారు. పేదరికం ఎన్ని అడ్డంకులు సృష్టించినా పట్టుదలతో అడుగులు వేశారు. ఆర్థిక ఇబ్బందులను అధిగమించి శాస్త్ర పరిశోధనల రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తమిళనాడులోని మారుమూల పల్లె నుంచి బెంగళూరులోని సీఎస్ఐఆర్ శాస్త్రవేత్త స్థాయికి ఎదిగిన కర్ణన్ ప్రయాణం నేటి యువతకు ఎంతో స్ఫూర్తిదాయకం.
రెక్కల కష్టంతో చదువుల బాట
తమిళనాడులోని శివగంగై జిల్లాకు చెందిన కర్ణన్ ఒక సాధారణ వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. పరిమితమైన ఆదాయం, ఇద్దరు సోదరుల పోషణతో కుటుంబ భారం మోయడం తల్లిదండ్రులకు పెను సవాలుగా ఉండేది. పాఠశాల రోజుల నుంచి పీజీ చదువుల వరకు వారాంతాల్లో కూలీ పనులకు వెళ్లి ఫీజులు చెల్లించేవారు. పీజీ సమయంలో ట్యూషన్లు చెబుతూ ఖర్చులు వెళ్లదీశారు. 2017లో మొదటి ప్రయత్నంలోనే నెట్ లెక్చరర్‌షిప్ సాధించినప్పటికీ, స్వల్ప తేడాతో జేఆర్ఎఫ్ చేజారడంతో పీహెచ్‌డీ కల ప్రశ్నార్థకంగా మారింది.
మలుపు తిప్పిన జాతీయ ఫెలోషిప్
పరిశోధనపై ఉన్న ఆసక్తిని కర్ణన్ ఏనాడూ వదులుకోలేదు. ట్యూషన్ల ద్వారా వచ్చే అరకొర ఆదాయంతోనే పీహెచ్‌డీ రిజిస్ట్రేషన్ ఫీజులు చెల్లిస్తూ పరిశోధన ప్రారంభించారు. 2019లో ఆయన జీవితాన్ని మార్చే కీలక మలుపు ఎదురైంది. నెట్ స్కోరు ఆధారంగా ఆయనకు నేషనల్ ఫెలోషిప్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్ స్టూడెంట్స్ (ఎన్‌ఎఫ్‌ఎస్‌సీ) పథకం కింద ఎంపికయ్యారు. హెచ్‌ఆర్‌ఏ, ఇతర అలవెన్సులతో కలిపి సుమారు రూ.16 లక్షల ఆర్థిక సహకారం అందింది. ఈ భరోసాతో మరోసారి పరీక్ష రాసి జేఆర్ఎఫ్ అర్హత కూడా సాధించారు.
అంతర్జాతీయ గుర్తింపు
ఆర్థిక వెసులుబాటు రావడంతో కర్ణన్ పూర్తి దృష్టిని శాస్త్ర పరిశోధనలపైనే కేంద్రీకరించారు. పీహెచ్‌డీ థీసిస్‌కు 'హైలీ కమెండెడ్' ప్రశంస దక్కింది. అంతర్జాతీయ ఎస్‌సీఐ, ఎస్‌సీఐఈ జర్నల్స్‌లో ఆరు పరిశోధనా పత్రాలను ప్రచురించారు. డాక్టరేట్ పూర్తి చేసిన తర్వాత బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ)లో ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఎమినెన్స్ పోస్ట్‌డాక్టోరల్ ఫెలోగా ఎంపికయ్యారు. అక్కడ నెలకు రూ.67 వేల గౌరవ వేతనంతో పాటు ఇంటి అద్దె భత్యం పొందుతూ కీలక పరిశోధనలు కొనసాగించారు.
కూలీ నుంచి శాస్త్రవేత్తగా ఉన్నత శిఖరాలకు
పరిశోధనల్లో సాధించిన నైపుణ్యంతో కర్ణన్ తాజాగా బెంగళూరులోని సీఎస్ఐఆర్ ఫోర్త్ పారాడైమ్ ఇన్‌స్టిట్యూట్‌లో సైంటిస్ట్-సి హోదాలో బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ఈ కేంద్రాన్ని సీఎస్ఐఆర్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ డేటా సైన్స్ అండ్ ఏఐగా పిలుస్తున్నారు. తన ఎదుగుదలతో పాటు సోదరుడి చదువును ప్రోత్సహించిన కర్ణన్, తల్లిదండ్రులకు చేదోడుగా నిలిచారు. తన స్వగ్రామంలోని పేద విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించేలా చేయూతనిస్తూ సమాజానికి తన వంతు సహకారాన్ని అందిస్తున్నారు.