రాష్ట్రాన్ని కాంట్రాక్టర్లకు దోచిపెట్టొద్దు: మంత్రులను ఉద్దేశించి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు
Advertisement
- సొంత ప్రభుత్వం తీరుపై మరోసారి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డి
- గత కేసీఆర్ ప్రభుత్వంలా కాకుండా నిజాయతీగా పాలన సాగించాలని హితవు
- కొడంగల్‌కు వేల కోట్ల నిధులు ఇచ్చి మునుగోడును విస్మరించారని ఆరోపణ
తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డి సొంత ప్రభుత్వం, మంత్రుల పనితీరుపై మరోసారి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పాలనలో పారదర్శకత ఉండాలని, రాష్ట్రాన్ని పెట్టుబడిదారులు, కాంట్రాక్టర్లకు దోచిపెట్టవద్దని ఆయన మంత్రులకు విజ్ఞప్తి చేశారు.
నియోజకవర్గాల అభివృద్ధి నిధుల కేటాయింపులో వివక్ష చూపుతున్నారని రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గానికి దాదాపు రూ. 10,000 కోట్ల వరకు నిధులు కేటాయిస్తూ, తీవ్ర వెనుకబడిన మునుగోడును విస్మరించడం సరికాదని ఆయన పేర్కొన్నారు. మునుగోడులో రోడ్లు, సాగునీటి పనులు, చౌటుప్పల్‌లో 100 పడకల ఆసుపత్రి వంటి అభివృద్ధి పనులు నిధుల కొరతతో ఆలస్యమవుతున్నాయని తెలిపారు.
గత బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి రాష్ట్రాన్ని ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టిందని విమర్శించిన రాజ్‌గోపాల్ రెడ్డి, ప్రస్తుత కాంగ్రెస్ మంత్రులైనా నిజాయతీగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. "రాష్ట్రాన్ని దొంగలకు, పెట్టుబడిదారులకు, కాంట్రాక్టర్లకు దోచిపెట్టకండి. నిజాయతీగా, అవినీతి లేకుండా పాలన చేస్తున్నారా లేదా అనేది ఒక్కసారి గుండె మీద చేయి వేసుకుని ఆత్మపరిశీలన చేసుకోవాలి అని మంత్రులకు హితవు పలికారు.
సొంత పార్టీ ఎమ్మెల్యే బహిరంగంగా ప్రభుత్వంపై వరుసగా ఈ తరహా వ్యాఖ్యలు చేస్తుండటం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.