తీరం దాటిన 'అక్వాన్' తుపాను.. ఒడిశా, ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు
Advertisement
- తీరం దాటే సమయంలో గంటకు 70 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులు
- శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో భారీగా 168.75 మి.మీ వర్షపాతం నమోదు
- ముందస్తు చర్యల్లో భాగంగా పలు రైళ్లు రద్దు చేసిన ఈస్ట్ కోస్ట్ రైల్వే
బంగాళాఖాతంలో ఏర్పడిన ‘అక్వాన్’ తుపాను తీరం దాటింది. ఒడిశాలోని గోపాల్‌పూర్ సమీపంలో ఈ ఉదయం 7.30 నుంచి 8.30 గంటల మధ్య తుపాను తీరాన్ని తాకినట్లు వాతావరణ శాఖ అధికారికంగా ధ్రువీకరించింది. తుపాను తీరం దాటే సమయంలో తీర ప్రాంతంలో గంటకు 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచాయని, అప్పుడప్పుడు వీటి తీవ్రత గరిష్ఠంగా 90 కిలోమీటర్ల వరకు నమోదైందని అధికారులు తెలిపారు.
తీరం దాటిన అనంతరం తుపాను ఉత్తర-ఈశాన్య దిశగా ఒడిశా మీదుగా కదులుతోంది. ఇది రాగల మూడు గంటల్లో తీవ్ర వాయుగుండంగా, ఆ తర్వాతి ఆరు గంటల్లో సాధారణ వాయుగుండంగా మరింత బలహీనపడుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది.
తుపాను ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు దక్షిణ ఒడిశాలో విస్తారంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో అత్యధికంగా 168.75 మి.మీ, అరకభద్రలో 162.50 మి.మీ, కంచిలిలో 148.50 మి.మీ వర్షపాతం నమోదైంది.
తుపాను దృష్ట్యా ఈస్ట్ కోస్ట్ రైల్వే ముందుజాగ్రత్తగా పలు రైళ్లను రద్దు చేసింది. ఒడిశా ప్రభుత్వం లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించింది. తుపాను బలహీనపడుతున్నప్పటికీ, ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం తదితర ప్రాంతాల ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.