మాజీ ఎమ్మెల్యే రేఖానాయక్ ఇళ్లపై ఈడీ మెరుపు దాడులు.. అరెస్ట్ చేసే అవకాశం

Telangana
Advertisement
  • ఖానాపూర్, హైదరాబాద్‌లలో ఉదయం నుంచే ముమ్మరంగా సాగుతున్న తనిఖీలు
  • రూ.40.96 కోట్ల విలువైన సీఎంఆర్ ధాన్యం పక్కదారి పట్టించినట్లు ఆరోపణలు
  • ఖానాపూర్ నివాసం వద్ద రేఖను అరెస్ట్ చేసే అవకాశం
నిర్మల్ జిల్లా ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్‌కు సంబంధించి కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దూకుడు పెంచింది. ఈ ఉదయం ఖానాపూర్‌తో పాటు హైదరాబాద్‌లోని ఆమె నివాసాల్లో ఈడీ అధికారులు ఏకకాలంలో ముమ్మర సోదాలు చేపట్టారు.

ఖానాపూర్ మండలం సత్తెనపల్లి వద్ద రేఖానాయక్‌కు చెందిన ఏఆర్‌ఎస్ ఆగ్రో ఇండస్ట్రీస్ రైస్ మిల్లుకు ప్రభుత్వం మిల్లింగ్ నిమిత్తం ధాన్యాన్ని కేటాయించింది. అయితే, 2022-23, 2023-24, 2024-25 రబీ సీజన్లకు సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన ధాన్యంలో పెద్ద మొత్తంలో బియ్యాన్ని తిరిగి ప్రభుత్వానికి అప్పగించకుండా పక్కదారి పట్టించినట్లు ఆరోపణలు వచ్చాయి. దీని విలువ మార్కెట్‌లో సుమారు రూ.40.96 కోట్లు ఉంటుందని పౌరసరఫరాల శాఖ గుర్తించింది.

గత ఆగస్టు నెలలో విజిలెన్స్ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో భారీగా ధాన్యం నిల్వలు మాయమైనట్లు తేలింది. దీనిపై జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి ఫిర్యాదు చేయడంతో ఖానాపూర్ పోలీస్ స్టేషన్‌లో క్రిమినల్ కేసు నమోదైంది. ఈ కేసు ఆధారంగా మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తు చేపట్టిన ఈడీ అధికారులు తాజాగా రంగంలోకి దిగి సోదాలు చేస్తున్నారు.

ప్రస్తుతం ఖానాపూర్‌లోని రేఖానాయక్ నివాసం వద్ద విజిలెన్స్, స్థానిక పోలీసు బలగాలు భారీగా మోహరించాయి. నివాసాల్లో రికార్డులను పరిశీలిస్తున్న అధికారులు, విచారణ అనంతరం ఆమెను అదుపులోకి తీసుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వ్యవహారం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 

Advertisement

సంబంధిత వార్తలు

Rekha NayakED Raids TelanganaCMR Rice ScamKhanapur Former MLAARS Agro IndustriesEnforcement Directorate Search

More Telugu News

'మిర్రర్ డైమెన్షన్'.. ఏఐ శిక్షణ కోసం నకిలీ ఇంటర్నెట్‌ను నిర్మించిన గూగుల్!

20 Nov, 11:09

అత్యవసరంగా నిర్ణయం తీసుకోండి.. బంగ్లాదేశ్ పాస్‌పోర్ట్ కోసం షేక్ హసీనా దరఖాస్తు

20 Nov, 10:55

81 మంది నూతన జాతీయ కార్యదర్శలను నియమించిన కాంగ్రెస్.. 50 శాతం మంది ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలు

20 Nov, 10:45

పులివెందులలో టెన్షన్.. ఎంపీ అవినాశ్‌ రెడ్డి కాన్వాయ్‌పై దాడి

20 Nov, 10:43

ఉగ్రవాదులకు ప్లాన్లు ఇస్తున్న ఏఐ.. అమెరికా పరిశోధనలో షాకింగ్ నిజాలు

20 Nov, 10:39

భారత్ ఇప్పుడు 'సైడ్ ప్లేయర్'.. విదేశీ గడ్డపై రాహుల్ గాంధీ వ్యాఖ్యల దుమారం!

20 Nov, 10:38

నీటి హక్కులపై రాజీ లేదు.. చుక్క నీటిని కూడా ఏపీకి వదులుకోం: మంత్రి ఉత్తమ్

20 Nov, 10:17

పాక్ అధ్యక్షుడే ఫిదా అయ్యారు.. ధోనీ గురించి రాజీవ్ శుక్లా చెప్పిన ఆసక్తికర ఘటన!

20 Nov, 10:14

టీ20 క్రికెట్‌లో చాహల్ అరుదైన రికార్డు.. 400 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా ఘనత

20 Nov, 10:12

మళ్లీ తగ్గుముఖం పట్టిన బంగారం, వెండి ధరలు.. నేటి రేట్లు ఇవే!

20 Nov, 09:46

ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 18 అంతస్తులకు వ్యాపించిన మంటలు

20 Nov, 09:44

గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్‌పై కెనడా భారీ రివార్డ్.. పట్టిస్తే రూ.1.63 కోట్లు

20 Nov, 09:30

పోలీసుల ఎన్‌కౌంటర్‌లో డి-కంపెనీ గ్యాంగ్‌స్టర్ హతం

20 Nov, 09:15

ఇంటి రుణ వసూలుకు ముందు కొనుగోలుదారు బాధ్యతను తేల్చాలి: సుప్రీంకోర్టు

20 Nov, 09:06
..More Telugu News