పబ్లిక్ లిస్టింగ్‌కు వెళ్లాల్సిందే.. టాటా గ్రూప్ దిగ్గజ సంస్థకు ఆర్‌బీఐ కఠిన ఆదేశాలు!
Advertisement
- అప్పర్-లేయర్ ఎన్‌బీఎఫ్‌సీ నిబంధనలన్నీ పాటించాల్సిందేనన్న ఆర్‌బీఐ
- రెగ్యులేటరీ మార్గదర్శకాలపై టాటా గ్రూప్ లేఖకు బదులిచ్చిన కేంద్ర బ్యాంకు
- ఈ నెలాఖరులో టాటా సన్స్ బోర్డు సమావేశం జరగనున్న వేళ వచ్చిన ఆదేశాలు
- సీఐసీ రిజిస్ట్రేషన్ స్వచ్ఛంద రద్దు కోరిన టాటా సన్స్ విజ్ఞప్తిని తోసిపుచ్చిన ఆర్‌బీఐ
- రుణాలు తీర్చినందున ఎన్‌బీఎఫ్‌సీ నిబంధనలు వర్తించవన్న టాటా సన్స్ వాదన తిరస్కరణ
టాటా గ్రూప్‌నకు చెందిన ప్రధాన హోల్డింగ్ కంపెనీ టాటా సన్స్‌కు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) మరోసారి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అప్పర్-లేయర్ నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలకు (ఎన్‌బీఎఫ్‌సీ) వర్తించే అన్ని నిబంధనలను పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. అందులో స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్టింగ్ నిబంధన కూడా తప్పనిసరి అని తేల్చిచెప్పింది. ఈ మేరకు టాటా సన్స్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌కు (సీఎఫ్‌వో) ఆర్‌బీఐ ఒక లేఖ ద్వారా తన వైఖరిని స్పష్టం చేసినట్లు నివేదికలు వెల్లడించాయి.
గత నెలలో టాటా సన్స్ రెగ్యులేటరీ మార్గదర్శకాలను కోరుతూ రాసిన లేఖకు సమాధానంగా ఆర్‌బీఐ ఈ ఆదేశాలు ఇచ్చింది. టాటా సన్స్ నిర్దిష్ట నిబంధనలపై ఎలాంటి స్పష్టత కోరకపోయినప్పటికీ, ఆ లేఖ స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ అంశానికి సంబంధించిన చర్చలతో ముడిపడి ఉన్నట్లు ఆర్‌బీఐ పేర్కొంది. అప్పర్-లేయర్ ఎన్‌బీఎఫ్‌సీలకు వర్తించే ప్రస్తుత నిబంధనలు, మార్గదర్శకాలు, ఆదేశాలన్నింటినీ తప్పకుండా అనుసరించాలని సూచించింది. ఈ నెలాఖరులో టాటా సన్స్ బోర్డు సమావేశం జరగనున్న నేపథ్యంలో ఆర్‌బీఐ నుంచి ఈ స్పందన రావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
గత సెప్టెంబర్‌లో కోర్ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీగా (సీఐసీ) తన రిజిస్ట్రేషన్‌ను స్వచ్ఛందంగా రద్దు చేసుకోవాలంటూ టాటా సన్స్ పెట్టుకున్న దరఖాస్తును ఆర్‌బీఐ తిరస్కరించింది. రుణాలన్నింటినీ పూర్తిగా తీర్చివేసినందున తమకు ఎన్‌బీఎఫ్‌సీ నిబంధనలు వర్తించవని టాటా సన్స్ వాదించింది. అయినపపటికీ ఆ విజ్ఞప్తిని తోసిపుచ్చిన నియంత్రణ సంస్థ ప్రస్తుత ఫ్రేమ్‌వర్క్‌కు కట్టుబడి ఉండాల్సిందేనని ఆదేశించింది. 2022లో అమల్లోకి వచ్చిన స్కేల్-బేస్డ్ రెగ్యులేషన్స్ కింద టాటా సన్స్‌ను అప్పర్-లేయర్ ఎన్‌బీఎఫ్‌సీగా వర్గీకరించారు. ఈ విభాగంలోకి వచ్చే సంస్థలు మూడేళ్ల కాలపరిమితిలోగా తప్పనిసరిగా స్టాక్ మార్కెట్లలో లిస్ట్ కావాలనే కఠిన నిబంధన ఉంది.