ఆన్‌లైన్ ఫార్మసీలపై 'టీజీ సేఫ్' కొరడా.. 23 మెడికల్ షాపుల లైసెన్సుల సస్పెన్షన్
Advertisement
- నిబంధనలు ఉల్లంఘించినందుకు చర్యలు తీసుకున్న 'టీజీ సేఫ్'
- టాటా 1ఎంజీ, నెట్‌మెడ్స్, అపోలో వంటి సంస్థల భాగస్వామ్య షాపులపై తనిఖీలు
- మరో 9 మెడికల్ షాపులకు హెచ్చరికలు జారీ చేసిన అధికారులు
- అక్రమ అమ్మకాలపై ఫిర్యాదులకు టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు
తెలంగాణలో ఆన్‌లైన్ మెడిసిన్ డెలివరీ ప్లాట్‌ఫామ్‌లతో అనుసంధానమై పనిచేస్తున్న 23 మెడికల్ షాపులపై అధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు. చట్టపరమైన నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను వాటి లైసెన్సులను సస్పెండ్ చేశారు. ఈ మేరకు 'తెలంగాణ స్టాండర్డ్స్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ ఎసెన్షియల్ డ్రగ్స్' (టీజీ సేఫ్) ఓ ప్రకటన విడుదల చేసింది.
డ్రగ్స్ వింగ్, ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ పోలీసులు సంయుక్తంగా రాష్ట్రవ్యాప్తంగా స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డ్రైవ్ నిర్వహించారు. టాటా 1ఎంజీ, నెట్‌మెడ్స్, జెప్టో, అపోలో 24/7, మెడ్‌ప్లస్ మార్ట్, ఇన్‌స్టామార్ట్ వంటి ప్రముఖ ఆన్‌లైన్ సంస్థలతో భాగస్వామ్యం ఉన్న ఫార్మసీలను లక్ష్యంగా చేసుకుని ఈ తనిఖీలు చేపట్టారు.
మొత్తం 23 సంస్థల లైసెన్సులను సస్పెండ్ చేయగా, వాటిలో 15 షాపుల లైసెన్సులను తదుపరి ఉత్తర్వులు జారీ చేసేంత వరకు రద్దు చేశారు. మరో 8 షాపుల లైసెన్సులను నిర్దిష్ట కాలం పాటు సస్పెండ్ చేశారు. నిబంధనలు సరిగా పాటించని ఇంకో 9 మెడికల్ షాపులకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్-1940 ప్రకారం మందుల అమ్మకాలకు తప్పనిసరిగా ప్రిస్క్రిప్షన్ ఉండటం, రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ పర్యవేక్షణ, రికార్డుల నిర్వహణ వంటి అంశాలను అధికారులు పరిశీలించారు. ఎవరైనా అక్రమంగా ఆన్‌లైన్‌లో మందులు అమ్ముతున్నట్లు అనుమానం ఉంటే, తమ టోల్-ఫ్రీ హెల్ప్‌లైన్ నంబర్ 1800-599-6969కు ఫిర్యాదు చేయవచ్చని 'టీజీ సేఫ్' ప్రజలకు సూచించింది. ఈ సేవలు పనిదినాల్లో ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉంటాయి.