హిందీ మాట్లాడని రామోజీరావు వద్ద అంత సమాచారం ఎలా ఉందో నాకు అర్థం కాలేదు: అమిత్ షా
Advertisement
- రామోజీరావు 90వ జయంతి సందర్భంగా ఘన నివాళులర్పించిన అమిత్ షా
- వివిధ రంగాల్లో విశేష సేవలందించిన ప్రతిభావంతులకు రామోజీరావు ఎక్సలెన్స్ అవార్డుల ప్రదానం
- ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గకుండా ప్రజాస్వామ్య నాలుగో స్తంభాన్ని కాపాడారని ప్రశంస
- మోదీ ప్రమాణ స్వీకార సమయంలో రామోజీరావుతో జరిగిన తొలి పరిచయం గుర్తుచేసుకున్న వైనం
- సమస్యల పరిష్కారంలో ఆయనకున్న దార్శనికత అద్భుతమన్న అమిత్ షా
మీడియా రంగంలో నైతిక విలువలతో కూడిన జర్నలిజానికి రామోజీరావు తిరుగులేని ప్రతీకగా నిలిచారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా కొనియాడారు. ఆయన కేవలం ఒక వ్యక్తి మాత్రమే కాదని, తన జీవితకాలంలోనే సమాజానికి మార్గదర్శనం చేసే ఒక మహోన్నత వ్యవస్థగా ఎదిగారని ప్రశంసించారు. రామోజీ గ్రూప్ వ్యవస్థాపకులు రామోజీరావు 90వ జయంతిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన విశిష్ట కార్యక్రమంలో వివిధ రంగాల్లో నిష్ణాతులైన ప్రతిభావంతులకు ‘రామోజీరావు ఎక్సలెన్స్ అవార్డుల’ను ప్రదానం చేశారు.
ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, కేంద్ర మంత్రులు జి. కిషన్ రెడ్డి, కింజరాపు రామ్మోహన్ నాయుడు, భూపతిరాజు శ్రీనివాస వర్మ, రామోజీ గ్రూప్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సీహెచ్ కిరణ్ తదితరులు హాజరయ్యారు.
సభనుద్దేశించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రసంగిస్తూ.. తొలుత తాను గొప్పదైన తెలుగు భాషలో మాట్లాడలేకపోతున్నందుకు సభికులకు క్షమాపణలు తెలిపారు. అనంతరం రామోజీరావుతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారి ప్రమాణస్వీకారం చేసిన సమయంలో తీవ్ర రద్దీ వల్ల తన వాహనం ముందుకుపోలేకపోయిందని.. ఆ సమయంలో చంద్రబాబు, రామోజీరావు కలసి తనను వారి కారులో ఎక్కించుకుని గుజరాత్ భవన్‌కు చేర్చారని, ఆ విధంగా రామోజీరావుతో తొలి పరిచయం ఏర్పడిందని వివరించారు. ఆ తర్వాత బీజేపీ అధ్యక్షుడిగా, కేంద్ర హోంమంత్రిగా నాలుగు సార్లు రామోజీ ఫిల్మ్ సిటీలో ఆయన్ను కలిసే అవకాశం లభించిందని తెలిపారు.
ఎక్కువగా ప్రయాణాలు చేయకపోయినా.. దేశంలో ఏ మారుమూల ఏం జరిగినా రామోజీరావు టేబుల్ వద్దకు పూర్తి సమాచారం ఉండేదని, అది చూసి తాను ఆశ్చర్యపోయానని అమిత్ షా అన్నారు. హిందీ మాట్లాడని రామోజీరావు వద్ద ఉత్తరప్రదేశ్ ఎన్నికల సమయంలో అంత సమాచారం ఉండడం తనకు విస్మయం కలిగించిందని చెప్పారు. ఆనాడు యూపీ ఎన్నికల్లో క్షేత్రస్థాయి పరిస్థితులపై స్పష్టమైన విశ్లేషణ ఇచ్చారని, ఫలితాలు కూడా సరిగ్గా ఆయన చెప్పినట్లే వచ్చాయని గుర్తుచేశారు. జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు అనంతరం తాను ఆయన్ను కలిసినప్పుడు.. ఈశాన్య రాష్ట్రాల్లోని వేర్పాటువాదం, తీవ్రవాదంపై ఆయన ఇచ్చిన సలహాలు, చూపిన అవగాహన అమోఘమని పేర్కొన్నారు. దేశ సమస్యల పరిష్కారానికి రామోజీరావు లాంటి వ్యక్తులను గౌరవ సలహాదారుగా తీసుకోవచ్చని తాను ఆ రోజే భావించినట్లు చెప్పారు.
కృష్ణా జిల్లాలోని ఒక సాధారణ రైతు కుటుంబంలో పుట్టి, ఎటువంటి వారసత్వం లేదా జర్నలిజం డిగ్రీ లేకపోయినా కేవలం సంకల్ప బలం, కఠిన శ్రమతో రామోజీరావు ‘ఈనాడు’ను ప్రారంభించారని అమిత్ షా గుర్తుచేశారు. తెలుగు ప్రజలకు నిజాన్ని అందించడమే లక్ష్యంగా పనిచేసి గొప్ప విప్లవం సృష్టించారన్నారు. భారత జర్నలిజం రంగంలో రామోజీరావును కేవలం రామ్‌నాథ్ గోయెంకాతో మాత్రమే పోల్చగలమని వ్యాఖ్యానించారు. సాంకేతిక మార్పులకు అనుగుణంగా ప్రాంతీయ భాషల్లో 24 గంటల వార్తా చానళ్లను ప్రారంభించి ‘ఈటీవీ’ ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చారని తెలిపారు. అనారోగ్యంతో ఉన్న చివరి రోజుల్లో కూడా మొబైల్ మాధ్యమంలో వార్తలను అందించాలనే తపనతో ఆయన పనిచేశారని చెప్పారు.
కేంద్రంలో గానీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గానీ అధికారంలో ఎవరున్నా.. ప్రభుత్వాల ఒత్తిళ్లకు లొంగకుండా తన మీడియా సంస్థల స్వాతంత్ర్యాన్ని రామోజీరావు కాపాడారని అమిత్ షా స్పష్టం చేశారు. ఎన్ని ఆర్థిక నష్టాలు, సవాళ్లు ఎదురైనా జర్నలిజం విలువలకు కట్టుబడి ప్రజాస్వామ్య నాలుగో స్తంభాన్ని నిలబెట్టారని కొనియాడారు. 2016లో ఆయనకు పద్మవిభూషణ్ లభించినప్పుడు అది రామోజీరావు ఒక్కరికే కాకుండా మొత్తం జర్నలిజం రంగానికి, తెలుగువారి ఆత్మగౌరవానికి దక్కిన గౌరవమని గుజరాతీ పత్రికలు రాశాయని గుర్తుచేశారు. రామోజీ ఫిల్మ్ సిటీ ద్వారా భారతీయ సినీ రంగానికి ఆయన చేసిన సేవలు అద్వితీయమని ప్రశంసించారు.
సైన్స్ అండ్ టెక్నాలజీ, యూత్ ఐకాన్, ప్రజాసేవ, కళలు-సంస్కృతి, విద్య, వైద్యం, గ్రామీణాభివృద్ధి, జర్నలిజం, మహిళా సాధికారత తదితర 9 విభాగాల్లో ప్రతిభ చూపిన వారికి ఈ కార్యక్రమంలో అవార్డులను అందజేశారు. జీవితంలో ఎన్నో అవార్డులు రావచ్చని, కానీ రామోజీరావు పేరుతో ఇచ్చే పురస్కారాన్ని అందుకోవడం ఎంతో ప్రత్యేకమైన గౌరవమని అవార్డు గ్రహీతలకు అమిత్ షా అభినందనలు తెలిపారు. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం సంస్కరణలు, అభివృద్ధి బాటలో ముందుకు సాగుతోందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.