వాట్సాప్‌లో ‘జాప్స్‌’ ఫీచర్‌.. చూసిన వెంటనే మాయమయ్యే ఫొటోలు, వీడియోలు!

Technology
Advertisement
  • వాట్సాప్‌ ‘జాప్స్‌’ పేరుతో కొత్త ఫీచర్‌ అభివృద్ధి
  • దీని ద్వారా నేరుగా కెమెరాతో తీసిన ఫొటోలు, వీడియోలను పంపే ఛాన్స్‌
  • అవతలి వ్యక్తి చూసిన వెంటనే అవి వారి చాట్‌ నుంచి మాయం
  • ఇంకా అభివృద్ధి దశలోనే ఉన్న ఈ ఫీచర్‌
  • పబ్లిక్‌ బీటా వెర్షన్‌లోనూ అందుబాటులోకి
వాట్సాప్‌ వినియోగదారుల కోసం మరో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చేందుకు మెటా సంస్థ సిద్ధమవుతున్నట్లు సమాచారం. ‘జాప్స్‌’ పేరుతో అభివృద్ధి చేస్తున్న ఈ ఫీచర్‌ ద్వారా ఫొటోలు, చిన్న వీడియోలను వేగంగా పంపుకోవచ్చు. వాటిని అవతలి వ్యక్తి ఒకసారి చూసిన వెంటనే వారి స్క్రీన్‌ నుంచి మాయమవుతాయి. గతంలో ఈ ఫీచర్‌ను ‘ఇన్‌స్టెంట్స్‌’ పేరుతో అభివృద్ధి చేయగా.. తాజాగా ‘జాప్స్‌’గా పేరు మార్చినట్లు వాట్సాప్‌ అప్‌డేట్లను పరిశీలించే వాబీటాఇన్ఫో వెల్లడించింది.

ఈ ఫీచర్‌ కోసం వాట్సాప్‌లో ప్రత్యేక కెమెరా ఇంటర్‌ఫేస్‌ అందుబాటులోకి రానుంది. అందులో నేరుగా ఫొటో తీయడం లేదా చిన్న వీడియో రికార్డు చేసి పంపడం సాధ్యమవుతుంది. గ్యాలరీలో ఉన్న ఫొటోలు, వీడియోలను అప్‌లోడ్‌ చేసే అవకాశం ఉండదు. పంపిన జాప్‌ను అవతలి వ్యక్తి చూసిన తర్వాత వారి చాట్‌లో కనిపించదు. అయితే పంపిన వారికి మాత్రం చాట్‌ హిస్టరీలో అవి కనిపిస్తాయని ప్రాథమిక సమాచారం.

ఒకే చాట్‌లో వరుసగా పంపిన జాప్‌లను ‘2 జాప్స్‌’ వంటి కౌంటర్‌తో ఒకచోట చూపించనున్నారు. సాధారణ వాట్సాప్‌ సందేశాల మాదిరిగానే వీటికీ ‘ఎండ్‌ టు ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌’ రక్షణ ఉంటుంది. జాప్‌లను వ్యక్తిగత కాంటాక్టులతో పాటు గ్రూపులు, పబ్లిక్‌ ఛానళ్లకు పంపే అవకాశం కూడా ఉండొచ్చని నివేదికలు చెబుతున్నాయి. వాటిని తెరిచినప్పుడు పంపిన వ్యక్తి పేరు కనిపిస్తుంది. ఎమోజీలతో స్పందించడం, టెక్స్ట్‌ రిప్లై ఇవ్వడం కూడా సాధ్యమవుతుంది. అయితే ఈ ఫీచర్‌ ఇంకా అభివృద్ధి దశలోనే ఉంది. పబ్లిక్‌ బీటా వినియోగదారులకు కూడా అందుబాటులోకి రాలేదు. దీనిపై వాట్సాప్‌ అధికారికంగా స్పందించలేదు.
Advertisement

సంబంధిత వార్తలు

WhatsAppWhatsApp Zaps featureMetaDisappearing photos and videosWhatsApp new updateWABetaInfo

More Telugu News

హైదరాబాదీలకు బిర్యానీ షాక్.. భారీగా పెరిగిన ధరలు!

16 Nov, 13:41

'ఓం' కోసం జుట్టు కట్ చేయడంతో అమ్మ బాగా బాధపడింది: సాయి పల్లవి ఆసక్తికర వ్యాఖ్యలు!

16 Nov, 13:28

బాంబు బెదిరింపుల వేళ అమితాబ్‌ పోస్ట్‌.. ‘బతికిపోయాం’ అంటూ వ్యాఖ్య

16 Nov, 13:26

హైదరాబాద్ జేఎన్‌టీయూలో విషాదం.. హాస్టల్ భవనంపై నుంచి దూకి విద్యార్థి ఆత్మహత్య

16 Nov, 13:16

మధురై తనిష్క్ దోపిడీ నిందితుడిని పట్టించిన ఆర్టీసీ బస్సు డ్రైవర్ సమయస్ఫూర్తి

16 Nov, 13:08

భారత్ ఏఐ పాలసీ భేష్.. యూర‌ప్‌లా కఠినంగా లేదు: ఐబీఎం సీఈఓ అరవింద్ కృష్ణ

16 Nov, 13:03

హైదరాబాద్‌ సదస్సులో ‘ఓట్‌ చోర్‌’ నినాదం.. ఇటలీ నేత వీసా నిబంధనలు ఉల్లంఘించారా?

16 Nov, 13:00

శబరిమల యాత్రకు వేళాయె.. రోజుకు 80 వేల మందికి దర్శనం

16 Nov, 12:55

సంగీత దర్శకుడిగా 15 ఏళ్లు.. అనిరుధ్ భావోద్వేగ సందేశం

16 Nov, 12:50

ఏపీలో రెండో విడత పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

16 Nov, 12:48

సచిన్‌తో గల్లీ క్రికెట్ ఆడిన ప్రిన్స్ విలియం దంప‌తులు.. ఇదిగో వీడియో!

16 Nov, 12:22

శ్రీకాకుళంలో నామినేషన్ కేంద్రం వద్ద ఉద్రిక్తత.. బ్యారికేడ్లను ఢీకొట్టిన బీజేపీ నేత కారు

16 Nov, 12:20

ఐసీసీ ఛైర్మన్‌గా జై షా.. రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నిక

16 Nov, 12:17

ఏఐ దుర్వినియోగంపై కేంద్రానికి చిరంజీవి విజ్ఞప్తి.. కిషన్ రెడ్డికి వినతిపత్రం అందజేసిన మెగాస్టార్

16 Nov, 12:12
..More Telugu News