సంగీత దర్శకుడిగా 15 ఏళ్లు.. అనిరుధ్ భావోద్వేగ సందేశం
Advertisement
- సంగీత దర్శకుడిగా 15 ఏళ్లు పూర్తి చేసుకున్న అనిరుధ్
- అభిమానులకు కృతజ్ఞతలు తెలిపుతూ భావోద్వేగ సందేశం
- పలు భాషల్లో పాటలు అందించిన అనుభవాలను గుర్తుచేసుకున్న అనిరుధ్
- అభిమానుల ప్రేమే తన ప్రయాణానికి బలమని వ్యాఖ్య
- ఇంకా ఎన్నో కలలు సాకారం చేసుకోవాల్సి ఉందంటూ ఎమోషనల్ పోస్ట్
సంగీత దర్శకుడిగా 15 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతూ భావోద్వేగ సందేశాన్ని పంచుకున్నారు. ఇన్నేళ్ల ప్రయాణంలో ఎన్నో మధుర జ్ఞాపకాలు, విజయాలు సొంతమయ్యాయని పేర్కొంటూ.. ఇంకా సాధించాల్సిన కలలు ఎన్నో ఉన్నాయని, తన అత్యుత్తమ సంగీతం ముందుందని వెల్లడించారు.
15 ఏళ్ల క్రితం ఇదే రోజున తమ తొలి పాట ప్రేక్షకుల ముందుకు వచ్చిందని అనిరుధ్ గుర్తుచేసుకున్నారు. అప్పటి నుంచి ఆగకుండా సాగుతున్న ప్రయాణంలో సంగీతం, జ్ఞాపకాలు, అద్భుతమైన అనుభవాలు ఎన్నో ఉన్నాయని తెలిపారు. తమిళం, తెలుగు, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో పాటలు రూపొందించే అవకాశం దక్కిందని చెప్పారు. స్వతంత్ర సంగీతం, అంతర్జాతీయ కళాకారులతో కలసి పనిచేయడం, వివిధ భాషల్లో పాటలు పాడటం తన ప్రయాణంలో ప్రత్యేక అనుభవాలని పేర్కొన్నారు.
దేశంలోని ప్రముఖ దర్శకులు, నటులు, నిర్మాతలతో కలిసి పనిచేసే అవకాశం లభించిందని అనిరుధ్ తెలిపారు. స్ట్రీమింగ్ రికార్డులు సృష్టించడం, కోట్లాది మంది శ్రోతలకు చేరువ కావడం, ప్రపంచవ్యాప్తంగా సంగీత కచేరీలు నిర్వహించడం మరచిపోలేని అనుభవాలని చెప్పారు. చార్ట్‌బస్టర్ పాటల నుంచి వేలాది మంది అభిమానులు తమ పాటలను గొంతెత్తి పాడటం వరకు ప్రతి సందర్భం ఎంతో ప్రత్యేకమని పేర్కొన్నారు.
ఈ ఏడాది తనకు మరింత ప్రత్యేకమని అనిరుధ్ వెల్లడించారు. 2026లో ఆయన సంగీతం అందించిన ఐదు సినిమాలు 'LIK', 'జననాయగన్', 'DC', 'పారడైజ్', 'జైలర్ 2' ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. వీటిలోని పలు పాటలు ఇప్పటికే హిట్‌లుగా నిలిచాయి. 15 ఏళ్ల సంగీత ప్రస్థానానికి ఇంతకంటే మంచి వేడుక ఉండదని ఆయన ఆనందం వ్యక్తం చేశారు.
ఎత్తుపల్లాలు, సవాళ్లు ఎదురైనా ఒక్కరోజు కూడా విరామం తీసుకోకుండా పనిచేశామని అనిరుధ్ చెప్పారు. సంగీతంపై మొదటిరోజు ఉన్న ప్రేమే ఇప్పటికీ తమను ముందుకు నడిపిస్తోందన్నారు. ఇటీవలే కావ్య మారన్‌ను వివాహం చేసుకున్న అనిరుధ్.. అభిమానులు, శ్రోతలు తన పాటలను మళ్లీ మళ్లీ వింటూ, పాడుతూ, ఆదరిస్తూ అండగా నిలిచినందుకు ధన్యవాదాలు తెలిపారు. 15 ఏళ్ల ప్రయాణం ముగిసినా, ఇంకా లక్షలాది కలలు సాకారం చేసుకోవాల్సి ఉందని, మళ్లీ స్టూడియోలోకి అడుగుపెడుతున్నానని పేర్కొన్నారు.