ఎన్నికలను వాయిదా వేయించేందుకు జగన్ కుట్రలు పన్నారు: ఎంపీ కలిశెట్టి
Advertisement
- బెంగళూరు ప్యాలెస్‌లో కూర్చొని జగన్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారన్న కలిశెట్టి
- వైసీపీ హయాంలో స్థానిక ఎన్నికల్లో తీవ్ర దౌర్జన్యాలు జరిగాయని వెల్లడి
- ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికలు ప్రశాంతంగా సాగుతున్నాయని వ్యాఖ్య
వైసీపీ అధినేత జగన్ పై విజయనగరం టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో రౌడీ మూకలను ప్రోత్సహించి, అల్లర్లు సృష్టించడం ద్వారా ఎన్నికలను వాయిదా వేయించాలని జగన్ కుట్రలు పన్నారని ఆయన ఆరోపించారు. అమరావతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పెద్ద ఎత్తున దౌర్జన్యాలు, అక్రమాలు జరిగాయని ఎంపీ కలిశెట్టి పేర్కొన్నారు. అయితే ప్రస్తుత ప్రభుత్వంలో ఎన్నికలు ఎంతో ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయని, దీనిని చూసి ప్రజలు హర్షిస్తున్నారని ఆయన చెప్పారు. ప్రజలు శాంతియుతంగా ఓటు హక్కు వినియోగించుకుంటుంటే, ఓర్వలేక ప్రత్యర్థి పార్టీ అలజడులు సృష్టించేందుకు ప్రయత్నిస్తోందని మండిపడ్డారు.
జగన్ బెంగళూరు ప్యాలెస్‌లో కూర్చొని ఆంధ్రప్రదేశ్‌పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఎంపీ ఆరోపించారు. తాడేపల్లి నివాసానికి జగన్ ఎప్పుడో ఒకసారి అతిథిలా వస్తూ, కేవలం ప్రెస్ మీట్లు పెట్టి ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారని విమర్శించారు. వైసీపీ చేస్తున్న కుట్రలను రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని, భవిష్యత్ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఇదే సమావేశంలో, విశాఖపట్నంలో సీఐఐ పెట్టుబడుల సదస్సు విజయవంతం కావడంపై ఎంపీ హర్షం వ్యక్తం చేశారు.