Advertisement

జనసేన నేత పేరు చెప్పి రూ.7 కోట్లకు టోకరా.. మంగళగిరిలో మహిళ అరెస్ట్

Andhra
Advertisement
  • జనసేన నేత శివ శ్రీనివాసరావు పేరుతో ఉద్యోగాల మోసం
  • దేవాదాయ, పోలీసు శాఖల్లో కొలువుల పేరిట నిరుద్యోగులకు వల
  • నకిలీ వాట్సాప్ ఖాతాలు, అపాయింట్‌మెంట్ లెటర్లతో మోసాలు
  • బాధిత యువకుడి ఫిర్యాదుతో బట్టబయలైన ఘరానా వ్యవహారం
  • ప్రధాన నిందితురాలు ధరణి కృష్ణ సహా నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
జనసేన పార్టీ ప్రోగ్రామ్ కమిటీ చైర్మన్, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కల్యాణ శివ శ్రీనివాసరావు పేరు చెప్పి నిరుద్యోగుల నుంచి ఏకంగా రూ.7 కోట్లు వసూలు చేసిన వ్యవహారంలో ధరణి కృష్ణ అనే మహిళను పోలీసులు మంగళగిరిలో అరెస్ట్ చేశారు. ఈ భారీ మోసానికి సంబంధించిన వివరాలు వెలుగులోకి వచ్చాయి.

పోలీసుల కథనం ప్రకారం.. విజయవాడకు చెందిన ధరణి కృష్ణ గతంలో మంగళగిరిలోని కైరెన్ కన్సల్టెన్సీ సర్వీసెస్‌లో పనిచేసేది. ఆ సమయంలో శివ శ్రీనివాసరావు తనకు స్వయానా బాబాయి అని చెప్పుకుంటూ నిరుద్యోగులను నమ్మించింది. ఆయనకున్న పలుకుబడితో దేవాదాయ, పోలీసు శాఖల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి ఏలూరు జిల్లాలో 16 మంది, తణుకులో 20 మంది నుంచి దాదాపు రూ.7 కోట్లు వసూలు చేసింది. బాధితులు ఇచ్చిన సొమ్ముకు పార్టీ నేతదే పూర్తి పూచీ అని నమ్మబలికింది.

ఈ క్రమంలో బాధితులకు అనుమానం రాకుండా ఉండేందుకు శివ శ్రీనివాసరావు ఫొటోతో నకిలీ వాట్సాప్ ప్రొఫైల్స్ సృష్టించి, ఫేక్ ఆడియో కాల్స్ ద్వారా మాట్లాడించేది. అంతేకాకుండా ప్రభుత్వ ముద్రలు, అధికారుల సంతకాలతో కూడిన నకిలీ అపాయింట్‌మెంట్ లెటర్లను తయారు చేసి నిరుద్యోగులకు అందించింది. తాను పనిచేస్తున్న కైరెన్ కన్సల్టెన్సీ, కంపెనీ సీఈవో కోట రుక్మిణి పేర్లను కూడా ధరణి కృష్ణ దుర్వినియోగం చేసింది. నలుగురు బాధితులకు ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున రిఫండ్ ఇచ్చినట్లు నకిలీ బిల్లులు, రసీదులు కూడా సృష్టించింది.

నవంబర్ 5వ తేదీన తరుణ్ అనే బాధితుడు స్వయంగా శివ శ్రీనివాసరావును కలిసి నిలదీయడంతో ఈ మొత్తం వ్యవహారం బయటపడింది. బాధితుడు చూపించిన నకిలీ పత్రాలు, వాట్సాప్ స్క్రీన్‌షాట్లను పరిశీలించిన శివ శ్రీనివాసరావు వెంటనే కన్సల్టెన్సీ సీఈవోను అప్రమత్తం చేశారు. దీంతో కంపెనీ యాజమాన్యం నవంబర్ 9న ధరణి కృష్ణకు షోకాజ్ నోటీసు జారీ చేసింది. నిమ్మకాయల పెద్దిరాజు ప్రోద్బలంతోనే తాను మధ్యవర్తిగా ఉండి ఈ పని చేశానని ఆమె లిఖితపూర్వకంగా అంగీకరించడంతో సంస్థ నుంచి ఆమెను తొలగించారు.

ఈ దారుణ మోసంపై కల్యాణ శివ శ్రీనివాసరావు, కన్సల్టెన్సీ సీఈవో కోట రుక్మిణి వేర్వేరుగా మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రధాన నిందితురాలు ధరణి కృష్ణతో పాటు ఈ కేసుతో సంబంధం ఉన్న మరో ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Advertisement

సంబంధిత వార్తలు

మీ కోసం మరిన్ని

Dharani KrishnaSiva Srinivasa RaoJana Sena PartyMangalagiri Job FraudAndhra Pradesh PoliceFake Job Scam

More Telugu News

'ఆపరేషన్‌ సిందూర్‌' ప్రైవేటు భద్రతా సిబ్బంది ప్రాధాన్యాన్ని చాటింది: మాజీ ఆర్మీ చీఫ్‌ ఉపేంద్ర ద్వివేది

13 Nov, 20:37

సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలు విలీనం.. కేంద్రం కీలక నిర్ణయం

13 Nov, 20:34

జేఈఈ మెయిన్‌-2027 దరఖాస్తుల్లో ఆధార్‌, జాతీయత ఎంపికపై ఎన్‌టీఏ కీలక సూచనలు

13 Nov, 20:10

ఇన్నాళ్లకు ఆ అదృష్టం లభించింది: రామ్ చరణ్

13 Nov, 20:06

పూర్తిగా మహిళా సిబ్బంది, సౌర విద్యుత్.. పుణే మెట్రో ‘పింక్ లైన్’ ప్రత్యేకతలివే!

13 Nov, 19:56

తెలంగాణ జైళ్ల శాఖకు అరుదైన గౌరవం.. ఒకేసారి 6 ఐఎస్ఓ సర్టిఫికెట్లు

13 Nov, 19:38

23 ఏళ్లకే చెరో రూ.40 వేల కోట్ల సంపద.. భారత సంతతి యువకుల ఘనత

13 Nov, 19:27

రాహుల్ ఆలోచనలను విదేశీయులు హ్యాక్ చేశారు.. ఫోన్ ను హ్యాక్ చేయాల్సిన అవసరం మాకేంటి?: బీజేపీ

13 Nov, 19:08

ప్రపంచంలో అత్యంత కాలుష్య నగరం లాహోర్ కాదు.. మన ఢిల్లీయే!

13 Nov, 19:07

నా ఫోన్‌ను మోదీ ట్యాప్‌ చేస్తున్నారు.. రాహుల్‌ గాంధీ సంచలన ఆరోపణ

13 Nov, 19:07

మూడ్నాలుగు విజిల్స్ వచ్చినా కుక్కర్ లో అన్నం, పప్పు ఉడకలేదు.. కేసు గెలిచిన విశాఖ మహిళ!

13 Nov, 18:52

టైమ్‌కు ఫ్లాట్‌లు అప్పగించని బిల్డర్లపై రెరా కొరడా.. 10.85 శాతం వడ్డీతో కట్టిన మొత్తం చెల్లించాలని ఆదేశం!

13 Nov, 18:39

అంతర్జాతీయ క్రికెట్‌లో ఎదుర్కోలేని బంతులేవీ ఉండవు.. కారణాలు చెప్పొద్దు: నేటి ఓటమిపై గంభీర్ సీరియస్

13 Nov, 18:34

46 ఏళ్ల క్రితం భూసేకరణ.. పరిహారం ఇవ్వకపోవడంతో అధికారుల కార్లను జప్తు చేసిన కోర్టు!

13 Nov, 18:32
..More Telugu News