Advertisement

హైదరాబాద్‌కు రాహుల్‌ గాంధీ.. స్వాగతం పలుకుతూ బీఆర్‌ఎస్‌ సంచలన పాట!

Telangana
Advertisement
  • రాహుల్‌ గాంధీ హైదరాబాద్‌ పర్యటన నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ ప్రత్యేక ర్యాప్‌ సాంగ్‌
  • ఆయనకు స్వాగతం పలికే ఇతివృత్తంతో బీఆర్‌ఎస్‌ వినూత్న నిరసన
  • హామీలను ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నిస్తూ ప్రత్యేకంగా ర్యాప్‌ సాంగ్‌
  • 6 గ్యారంటీలు, ఎన్నికల హామీల అమలుపై పాట ద్వారా ప్రశ్నలు
కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ హైదరాబాద్‌ పర్యటనకు వస్తున్న వేళ బీఆర్‌ఎస్‌ వినూత్న నిరసనకు తెరతీసింది. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నిస్తూ ప్రత్యేకంగా పంజాబీ శైలిలో ఓ ర్యాప్‌ సాంగ్‌ను విడుదల చేసింది. మహిళలకు నెలకు రూ.2,500 సాయం, రూ.4 వేల పింఛన్‌ సహా కాంగ్రెస్‌ ప్రకటించిన ఆరు గ్యారంటీల అమలుపై నిలదీసింది. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే హామీలన్నీ నెరవేరుస్తామని చెప్పి ఇంతకాలం ఎందుకు జాప్యం చేస్తున్నారని పాట ద్వారా ప్రశ్నించింది.

భారత్‌ సమ్మిట్‌లో పాల్గొనేందుకు రాహుల్‌ గాంధీ శనివారం హైదరాబాద్‌కు రానున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు స్వాగతం పలికే ఇతివృత్తంతో బీఆర్‌ఎస్‌ ఈ పాటను రూపొందించింది. 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలను ప్రస్తావిస్తూ వాటి ప్రస్తుత పరిస్థితి ఏంటో రాహుల్‌ వివరించాలని డిమాండ్‌ చేసింది.

మరోవైపు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కూడా రాహుల్‌ పర్యటనకు ముందు సామాజిక మాధ్యమం 'ఎక్స్‌' వేదికగా విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో వివిధ వర్గాల ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళనలు చేసినప్పుడు రాహుల్‌ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ఉద్యోగాలు కోరుతూ నిరసన తెలిపిన విద్యార్థులపై పోలీసుల చర్యలు, లగచర్లలో గిరిజన మహిళలపై దాడుల ఆరోపణలు జరిగినప్పుడు ఎందుకు రాలేదని నిలదీశారు.

హైడ్రా కూల్చివేతలతో పేదల ఇళ్లు నేలమట్టమైనప్పుడు, కంచ గచ్చిబౌలి హెచ్‌సీయూ భూముల్లో వేలాది చెట్లను తొలగించినప్పుడు, జింకలు, నెమళ్లు సహా జీవవైవిధ్యానికి నష్టం జరిగినప్పుడు రాహుల్‌ మౌనంగా ఉన్నారని కేటీఆర్‌ ఆరోపించారు. కేబీఆర్‌ పార్కు విధ్వంసం జరుగుతున్నా పట్టించుకోలేదని విమర్శించారు.

పది మంది బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో చేర్చుకోవడం ద్వారా రాజ్యాంగ ప్రక్రియలను అపహాస్యం చేశారని కేటీఆర్‌ ఆరోపించారు. ‘‘అసెంబ్లీ ముందు మహిళా ఎమ్మెల్యేల చీరలు లాగి దాడులు చేసిన ఘటనపైనా రాహుల్‌ స్పందించలేదు. రైతులు, నేతన్నల ఆత్మహత్యలు, జర్నలిస్టుల అర్ధరాత్రి అరెస్టులు, భూకబ్జాలు, అవినీతి ఆరోపణలపై ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడు రూ.100 కోట్ల ప్రజాధనంతో నిర్వహిస్తున్న ప్రచార కార్యక్రమం కోసం హైదరాబాద్‌కు వస్తున్నారు’’ అంటూ విమర్శలు గుప్పించారు.
Advertisement

సంబంధిత వార్తలు

మీ కోసం మరిన్ని

Rahul GandhiBRS Rap SongHyderabad VisitKTR CriticismCongress Six GuaranteesTelangana Politics

More Telugu News

అమరావతిలో స్పోర్ట్స్ అకాడమీ ఏర్పాటు చేయండి.. ఆర్పీఎస్జీ గ్రూప్ ను కోరిన మంత్రి లోకేశ్

13 Nov, 15:33

ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న కాన్వాయ్‌కి ప్రమాదం.. ఆరుగురికి గాయాలు

13 Nov, 15:32

కొండెక్కిన కోడిగుడ్డు ధర.. సామాన్యులకు షాక్!

13 Nov, 15:17

లోకేశ్ సమక్షంలో రెండో రోజూ పెట్టుబడుల వరద.. ఎంఓయూలు కుదుర్చుకున్న 24 కంపెనీలు ఇవే!

13 Nov, 15:15

ఎం.ఎం.కీరవాణిలో ఇంత మార్పా? ఫొటోలు పంచుకున్న అనుపమ్‌ ఖేర్

13 Nov, 15:01

కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు నీటి మళ్లింపుపై విచారణ జరపాలి: కవిత డిమాండ్

13 Nov, 14:58

నాలుగో వన్డేలో భారత్‌కు ఘోర పరాజయం.. 244 పరుగులతో న్యూజిలాండ్‌ చారిత్రక విజయం!

13 Nov, 14:55

ఏపీలో కనిపిస్తున్న మార్పులు, అభివృద్ధి అసాధారణం.. చంద్రబాబు నాయకత్వంపై ‘టైమ్’ ప్రత్యేక ప్రశంసలు

13 Nov, 14:50

'ఇట్లు అర్జున' (మూవీ రివ్యూ)

13 Nov, 14:46

క్యాబ్‌ త్వరగా బుక్‌ కావాలంటే ముందే ‘టిప్‌’.. ఓలాపై సీసీపీఏ జరిమానా!

13 Nov, 14:42

ఏపీ రాజధానిలో ఒబెరాయ్ ఫైవ్ స్టార్ హోటల్.. సీఐఐ సదస్సులో కీలక ఒప్పందం

13 Nov, 14:37

టీటీడీకి రూ.10 కోట్ల విరాళం ఇచ్చిన హైదరాబాద్ భక్తుడు

13 Nov, 14:28

హైదరాబాద్‌ భారత్‌ సమ్మిట్‌కు 115 మంది విదేశీ వక్తలకు నో ఎంట్రీ.. శశిథరూర్‌ సంచలన ఆరోపణలు

13 Nov, 14:20

బిల్ గేట్స్‌ను అలా ఒప్పించా.. సీఐఐ సదస్సులో ఆసక్తికర విషయాలు చెప్పిన చంద్రబాబు

13 Nov, 14:08
..More Telugu News