Advertisement

రాహుల్ గాంధీ హైదరాబాద్ పర్యటనపై కేటీఆర్ తీవ్ర విమర్శలు

Telangana
Advertisement
  • నిరుద్యోగులపై దాడులు, హైడ్రా కూల్చివేతలపై రాహుల్ ఎందుకు మాట్లాడరన్న కేటీఆర్
  • భారత్ సమ్మిట్ కోసం రూ.100 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేశారని ఆరోపణ
  • బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై దాడి జరిగినా స్పందించలేదని విమర్శ
హైదరాబాద్‌లో జరిగే ‘భారత్ సమ్మిట్ 2026’లో పాల్గొనేందుకు వస్తున్న కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పర్యటనపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘ఎక్స్’ వేదికగా రాహుల్ గాంధీకి పలు సూటి ప్రశ్నలు సంధిస్తూ విమర్శలు గుప్పించారు.

ఉద్యోగాల కోసం పోరాడుతున్న నిరుద్యోగ యువతపై కాంగ్రెస్ పోలీసులు దాడులు చేసినప్పుడు రాహుల్ ఎక్కడున్నారని కేటీఆర్ నిలదీశారు. లగచర్లలో గిరిజన మహిళలపై దాడులు జరిగినప్పుడు, హైడ్రా బుల్డోజర్లతో సామాన్యుల ఇళ్లను కూల్చివేస్తుంటే రాహుల్ ఢిల్లీలో నిద్రపోతున్నారా? అని ప్రశ్నించారు. కంచ గచ్చిబౌలి హెచ్‌సీయూ భూముల్లో వేలాది చెట్లను నరికివేయడం, 10 మంది బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లోకి చేర్చుకోవడం, అసెంబ్లీ వద్ద బీఆర్‌ఎస్ మహిళా ప్రజాప్రతినిధులపై జరిగిన దాడి ఘటనలపై రాహుల్ ఎందుకు నోరు మెదపలేదని నిలదీశారు. తెలంగాణ ప్రజల సొమ్ము దాదాపు రూ. 100 కోట్లతో ఈ ప్రచార ఆర్భాటం చేస్తున్నారని ఆరోపించారు.
Advertisement

సంబంధిత వార్తలు

మీ కోసం మరిన్ని

KTRRahul GandhiHyderabad VisitBRS CongressTelangana Politics

More Telugu News

రాష్ట్రపతి చేతుల మీదుగా జాతీయ క్రీడా పురస్కారాల ప్రదానం.. 15 మందికి అర్జున అవార్డుల అందజేత

13 Nov, 13:08

రాత్రిపూట సూర్యరశ్మి: చంద్రబాబు వ్యాఖ్యలపై ట్రోలింగ్.. ఫ్యాక్ట్ చెక్‌తో ప్రభుత్వ వివరణ

13 Nov, 13:00

తెలంగాణలో మరింత పడిపోనున్న ఉష్ణోగ్రతలు.. ప్రజలకు వైద్యారోగ్య శాఖ హెచ్చరిక

13 Nov, 12:58

పూజా సామగ్రి, విగ్రహాల సేకరణకు జీహెచ్‌ఎంసీ 'ప్రాజెక్ట్ ఉద్వాసన'.. 12 కేంద్రాల ఏర్పాటు

13 Nov, 12:48

జాకిర్ నాయక్ సంస్థపై మరో ఐదేళ్లు నిషేధం.. కేంద్రం కీలక ఉత్తర్వులు

13 Nov, 12:45

ఏపీలో తొలి దశ గ్రామ పంచాయతీ ఎన్నికలు.. నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ

13 Nov, 12:41

ఐటీ శకం ముగిసింది.. ఇక ఏఐ, క్వాంటం యుగం: సీఎం చంద్రబాబు

13 Nov, 12:11

రాప్తాడు బాలికకు ఆర్థిక సాయం అందించిన తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి

13 Nov, 12:00

విల్ యంగ్ కెరీర్ బెస్ట్ సెంచరీ.. భార‌త్ ముందు భారీ టార్గెట్‌

13 Nov, 11:58

ఏఐతో పెను ప్రమాదం.. గూగుల్, మెటాపై కోర్టులో వ్యాజ్యం

13 Nov, 11:30

రోడ్ల ఆధునికీకరణపై మేధోమథనం.. హైటెక్స్‌ వేదికగా ఇండియన్ రోడ్ కాంగ్రెస్: కోమటిరెడ్డి

13 Nov, 11:28

హైదరాబాద్ సీపీగా ఇక సెలవు.. వీసీ సజ్జనార్ భావోద్వేగ సందేశం

13 Nov, 11:15

హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్ వద్ద మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ధర్నా

13 Nov, 10:54

భవనం మధ్యలోంచి దూసుకెళ్లనున్న మెట్రో రైలు.. చెన్నైలో వినూత్న ప్రాజెక్ట్

13 Nov, 10:50
..More Telugu News