ఆమె అందం చూసి భయపడ్డా.. పోటీ నుంచి తప్పుకుందామనుకున్నా.. కానీ..: సుస్మితా సేన్
Advertisement
- మిస్ ఇండియా పోటీలో ఐశ్వర్య రాయ్ ఉందని తెలిసి వెనక్కి తగ్గాలనుకున్న సుస్మిత
- ఐశ్వర్య అందానికి భయపడి 25 మంది అమ్మాయిలు తప్పుకున్నారని తెలుసుకుని ఆందోళన
- పోటీ నుంచి తప్పుకోవద్దని, ప్రయత్నించాలని సుస్మిత తల్లి గట్టిగా మందలింపు
- ఓడితే ఆమె చేతిలోనే ఓడిపో... అంతేకానీ పారిపోవద్దన్న తల్లి
- అదే ఏడాది సుస్మిత మిస్ యూనివర్స్, ఐశ్వర్య మిస్ వరల్డ్ కిరీటాలు గెలుపు
భారత్ తరఫున తొలి మిస్ యూనివర్స్ కిరీటాన్ని గెలిచి చరిత్ర సృష్టించిన నటి సుస్మితా సేన్, తొలినాళ్లలో తీవ్రమైన ఆత్మన్యూనతకు గురయ్యారట. అందాల పోటీల్లో ఐశ్వర్య రాయ్ కూడా పాల్గొంటున్నారని తెలిసి, పోటీ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు ఆమె గతంలో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ ఆసక్తికరమైన సంఘటన ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వివరాల్లోకి వెళితే.. మిస్ ఇండియా పోటీల కోసం దరఖాస్తు చేయడానికి వెళ్లినప్పుడు, అదే పోటీలో ఐశ్వర్య రాయ్ కూడా పాల్గొంటున్నారని సుస్మితకు తెలిసింది. అప్పటికే ఐశ్వర్య అందం గురించి అందరూ మాట్లాడుకుంటున్నారని, ఆమె పోటీలో ఉందని తెలిసి 25 మంది అమ్మాయిలు తమ దరఖాస్తులను వెనక్కి తీసుకున్నారని నిర్వాహకులు చెప్పడంతో సుస్మిత కూడా భయపడ్డారు. దీంతో తాను కూడా పోటీ నుంచి వైదొలగాలని నిర్ణయించుకుని ఇంటికి వెళ్లారు.
ఈ విషయాన్ని తల్లితో చెప్పగా ఆమె తీవ్రంగా మందలించారని సుస్మిత గుర్తుచేసుకున్నారు. "ప్రయత్నం చేయకుండానే ఓటమిని అంగీకరిస్తావా? ఆమె ప్రపంచంలోనే అత్యంత అందగత్తె అని నువ్వు భావిస్తే, ఆమె చేతిలోనే ఓడిపో. అంతేకానీ వేరొకరి చేతిలో ఓటమి పాలవడం ఎందుకు? వెళ్లి నీ శక్తిమేర ప్రయత్నించు" అని తన తల్లి గట్టిగా చెప్పినట్లు సుస్మిత వివరించారు.
తల్లి మాటలతో స్ఫూర్తి పొందిన సుస్మిత, పోటీలో నిలిచి మిస్ ఇండియా టైటిల్‌ను గెలుచుకున్నారు. ఆ తర్వాత మిస్ యూనివర్స్ కిరీటాన్ని సొంతం చేసుకున్నారు. అదే ఏడాది ఐశ్వర్య రాయ్ మిస్ వరల్డ్ విజేతగా నిలిచి దేశానికి గర్వకారణంగా నిలిచారు. ఆ తర్వాత సుస్మిత 'బీవీ నెం.1', 'మై హూ నా', 'ఆర్య', 'తాలీ' వంటి చిత్రాలు, సిరీస్‌లతో నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.