Advertisement

అయ్యప్ప దయ వల్ల అందరం క్షేమంగా ఉన్నాం: శేఖర్ మాస్టర్

Entertainment
Advertisement
  • శంషాబాద్ ముచ్చింతల్ సమీపంలో శేఖర్ మాస్టర్ ప్రయాణిస్తున్న కారుకు ప్రమాదం
  • అతివేగంగా వచ్చిన పండ్ల లోడు లారీ కారును వెనుక నుంచి బలంగా ఢీకొట్టిన వైనం
  • ప్రమాద తీవ్రతకు పూర్తిగా నుజ్జునుజ్జైన కారు వెనుక భాగం
టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ప్రయాణిస్తున్న కారుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఈ దుర్ఘటనలో ఆయనతో పాటు కారులో ఉన్న మరో ముగ్గురు ఎలాంటి గాయాలు లేకుండా సురక్షితంగా బయటపడ్డారు.

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న చిత్రం ‘కాకా’లో ఒక పాటకు సంబంధించిన నైట్ షూటింగ్ ముగించుకుని, శేఖర్ మాస్టర్ తన బృందంతో కలిసి కారులో తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్ వద్దకు చేరుకోగానే... ఉదయం సుమారు 6 గంటల ప్రాంతంలో వెనుక నుంచి అతివేగంగా వచ్చిన పండ్ల లోడు లారీ వీరి కారును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద తీవ్రతకు కారు వెనుక భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది. అయితే, కారులోని శేఖర్ మాస్టర్‌తో పాటు ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు క్షేమంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

ఈ ప్రమాదంపై శేఖర్ మాస్టర్ ఒక వీడియో సందేశం ద్వారా స్పందిస్తూ... "కాకా సాంగ్ షూటింగ్ ని ముగించుకొని తిరిగి వస్తుంటే తెల్లవారుజామున 6 గంటలకు కారు యాక్సిడెంట్ కి గురైంది. కారు వెనక భాగం పూర్తిగా దెబ్బతింది. ఆ సమయంలో కారులో మేము నలుగురం ఉన్నాం.. అయ్యప్ప దయ వల్లే మాకు ఏమీ జరగలేదు. అందరూ నాకు ఏమైందో అని మెసేజ్ లు చేస్తున్నారు. నేను క్షేమంగా ఉన్నాను. మాతో పాటు ఉన్నవారు కూడా క్షేమంగా ఉన్నారు. ఈరోజు రాత్రికి కూడా షూటింగ్ ఉంది. దానికి బయల్దేరుతున్నాను" అని తెలిపారు.

ఇటీవలే అయ్యప్ప స్వామి మాల ధరించిన శేఖర్ మాస్టర్.. స్వామివారి ఆశీస్సుల వల్లే ఇంతటి ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డామని భావోద్వేగంతో వెల్లడించారు. తామంతా క్షేమంగా ఉన్నామని చెప్పడంతో అభిమానులు, సినీ ప్రముఖులు ఊపిరి పీల్చుకున్నారు.
Advertisement

సంబంధిత వార్తలు

మీ కోసం మరిన్ని

Sekhar MasterSekhar Master car accidentShamshabad road accidentMuchintal car accidentChoreographer Sekhar MasterSekhar Master safe

More Telugu News

అండర్‌-19 ఆసియా కప్‌ సెమీస్‌లో అదరగొట్టిన టీమిండియా.. ఫైనల్లో పాక్‌తో పోరుకు సై

12 Nov, 17:15

కీలక ఖనిజాల వేటలో భారత్ దూకుడు.. ప్రపంచంలోనే రెండో స్థానం

12 Nov, 17:02

రిసాల్వెన్ సీఈవో పరాగ్ శర్మతో నారా లోకేశ్ భేటీ.. సీమలో భారీ ప్రాజెక్టుకు ఆహ్వానం

12 Nov, 17:00

తండ్రి ఆస్తిలో కొడుకుకు జన్మహక్కు ఉంటుందా? సుప్రీంకోర్టు కీలక తీర్పు

12 Nov, 16:50

గత జన్మలో నేను రాజుని.. నా భార్య మంత్రిని ప్రేమించింది: సంజయ్ దత్ చెప్పిన పూర్వజన్మ వృత్తాంతం

12 Nov, 16:44

టీడీపీ సీనియర్ నేత శత్రుచర్ల విజయరామరాజు కన్నుమూత

12 Nov, 16:43

తగ్గిన ధరలు.. పండగ వేళ బంగారం కొనుగోళ్లకు ఎగబడ్డ జనం.. ఏకంగా 52 టన్నుల పసిడి విక్రయం!

12 Nov, 16:27

స్వల్ప లాభాలతో ముగిసిన సెన్సెక్స్‌, నిఫ్టీ.. 4 శాతం పెరిగిన రియల్టీ సూచీ

12 Nov, 16:18

జీటీఏ-6 ఆడితే ఏడాదికి రూ.కోటికి పైగా జీతం.. భలే ఉద్యోగం!

12 Nov, 16:09

పాకిస్థాన్‌లో ఉగ్రవాదుల భీకర దాడి.. పది మంది పోలీసుల మృతి

12 Nov, 16:06

బహుశా అందుకే పీవీకి సోనియా తగిన గౌరవం ఇవ్వలేదేమో!: పృథ్వీరాజ్ చవాన్

12 Nov, 15:52

వాతావరణ మార్పుల సూచీలో భారత్‌కు 28వ ర్యాంకు.. తొలి మూడు స్థానాలు ఖాళీ!

12 Nov, 15:48

యూపీ ఎన్నికల్లో కొత్త కూటమి.. చేతులు కలిపిన ఒవైసీ, చంద్రశేఖర్ ఆజాద్

12 Nov, 15:41

2047 వరకు వేచి చూడాల్సిన పనిలేదు.. అంతకంటే ముందే వికసిత భారత్: ప్రధాని మోదీ

12 Nov, 15:38
..More Telugu News