Advertisement

మీర్‌పేటలో దారుణం.. మహిళను హతమార్చి బంగారు ఆభరణాల దోపిడీ.. తెలిసిన వారే చంపారా?

Telangana
Advertisement
  • మీర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో అనిత అనే మహిళ దారుణ హత్య
  • తలపై బలంగా కొట్టి చంపి, బంగారు నగలు దోచుకెళ్లిన దుండగులు
  • తెలిసిన వారే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని పోలీసుల అనుమానం
  • సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల కోసం గాలింపు
హైదరాబాద్ శివారు మీర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పోష్ కాలనీలోని శ్రీ లక్ష్మీ రెసిడెన్సీ అపార్ట్‌మెంట్‌లో అనిత అనే మహిళను దుండగులు అత్యంత పాశవికంగా హత్య చేశారు. నిన్న‌ జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

వివరాల్లోకి వెళితే.. పాఠశాలకు వెళ్లిన పిల్లలు సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చేసరికి, తమ తల్లి రక్తపు మడుగులో పడి ఉండటాన్ని చూసి తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే వారు మిధానిలో పనిచేసే తమ తండ్రికి సమాచారం అందించారు. ఆయన హుటాహుటిన ఇంటికి చేరుకుని, పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అనిత తలపై బలమైన గాయం ఉన్నట్లు గుర్తించారు. ఆమె మెడలోని బంగారు గొలుసు, చేతికి ఉన్న రెండు గాజులు కనిపించకుండా పోయాయి. ఇంట్లోకి బలవంతంగా ప్రవేశించిన ఆనవాళ్లు లేకపోవడంతో బాధితురాలికి తెలిసిన వ్యక్తులే ఈ ఘాతుకానికి పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్‌తో కలిసి పోలీసులు ఫ్లాట్‌లో ఆధారాలు సేకరించారు. నిందితులను గుర్తించేందుకు అపార్ట్‌మెంట్ సమీపంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న మీర్‌పేట పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
Advertisement

సంబంధిత వార్తలు

మీ కోసం మరిన్ని

AnitaMeerpetHyderabad CrimeGold Robbery MurderSri Lakshmi ResidencyMeerpet Police Investigation

More Telugu News

యూపీ ఎన్నికల్లో కొత్త కూటమి.. చేతులు కలిపిన ఒవైసీ, చంద్రశేఖర్ ఆజాద్

12 Nov, 15:41

2047 వరకు వేచి చూడాల్సిన పనిలేదు.. అంతకంటే ముందే వికసిత భారత్: ప్రధాని మోదీ

12 Nov, 15:38

జియో తరహాలోనే గ్రీన్ ఎస్‌ఎమ్ వ్యూహం: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

12 Nov, 15:36

ఆర్టీసీ సిబ్బందిపై దాడులు చేస్తే సహించేది లేదు.. మంత్రి పొన్నం హెచ్చరిక

12 Nov, 15:29

బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం.. 15 నాటికి వాయుగుండం!

12 Nov, 15:28

సత్తా చాటుతున్న ఆసీస్ యువ సంచలనం.. సీజన్‌లో మూడో సెంచరీతో టెస్టు రేసులోకి శామ్ కాన్‌స్టాస్

12 Nov, 15:15

నాలుగో వన్డేకు కొత్త టీమిండియా.. కెప్టెన్ గా అయ్యర్‌.. టీమ్ లో కీలక మార్పులు!

12 Nov, 15:12

కరీనా కపూర్ ధరించిన లాకెట్‌పై వివాదం.. అండగా నిలిచిన హిందూ సంస్థ

12 Nov, 15:08

ముంబై లోకల్ రైలులో దారుణం.. వేధింపులను ప్రతిఘటించిన యువతిని తోసేయడంతో తెగిపడిన చేయి!

12 Nov, 14:52

'పుష్పక విమానం' (జియో హాట్ స్టార్) సిరీస్ రివ్యూ!

12 Nov, 14:51

ఏపీలో పెండింగ్‌లో ఉన్న 4 కార్పొరేషన్లు, 19 మున్సిపాలిటీలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల

12 Nov, 14:48

అరవింద్ కేజ్రీవాల్, ఆయన కుమార్తెకు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పేరుతో బెదిరింపులు

12 Nov, 14:38

అల్లరి నరేశ్‌ ‘ఆల్కహాల్‌’ విడుదల తేదీ ఖరారు.. సత్యతో కలిసి కామెడీ పంచేందుకు రెడీ

12 Nov, 14:35

ఐరన్ మ్యాన్ స్ఫూర్తితో 'జార్విస్'.. ఇంటర్నెట్ లేకుండానే పనిచేసే స్మార్ట్ రూమ్.. భారతీయ కుర్రాడి అద్భుత సృష్టి!

12 Nov, 14:12
..More Telugu News