Advertisement

స్థానిక ఎన్నికల్లో ఓటములపై లోకేశ్‌ సమీక్ష.. 4 అంశాలపై నివేదికలకు ఆదేశం!

Andhra
Advertisement
  • స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ఓటములపై నారా లోకేశ్‌ దృష్టి
  • నాలుగు అంశాల ఆధారంగా కారణాలను తెలియజేయాలని పార్టీ నేతలకు సూచన
  • క్యాడర్‌ అభిప్రాయాలకు విరుద్ధంగా అభ్యర్థుల ఎంపికతో ఓడిన స్థానాలేంటో గుర్తించాలన్న మంత్రి
  • ఎమ్మెల్యేల పనితీరు, కూటమి సమన్వయ లోపం, వైసీపీ సంస్థాగత బలంపైనా నివేదిక కోరిన లోకేశ్‌
  • 76 జడ్పీటీసీ, 1,700 ఎంపీటీసీ స్థానాల్లో ఓటమికి కారణాలను విశ్లేషించాలని సూచన
ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించినప్పటికీ.. కొన్ని చోట్ల ఎదురైన పరాజయాలపై మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ దృష్టి సారించారు. ఓటమికి దారితీసిన కారణాలను గుర్తించి, భవిష్యత్తులో అలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా పార్టీ నేతల నుంచి నాలుగు అంశాలపై నివేదికలు కోరినట్లు సమాచారం.

మున్సిపల్‌ ఎన్నికల్లో కూటమి మంచి ఫలితాలు సాధించింది. అయితే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి వైసీపీ నుంచి పలు చోట్ల గట్టి పోటీ ఎదురైంది. ఫలితంగా 76 జడ్పీటీసీ స్థానాలతో పాటు 1,700 ఎంపీటీసీ స్థానాల్లో కూటమి ఓటమి చవిచూసింది. ఈ పరాజయాలకు కారణాలేంటన్నది తెలుసుకునేందుకు లోకేశ్‌ సమీక్షకు సిద్ధమయ్యారు.

ఓటమికి దారితీసిన అంశాలను నాలుగు కేటగిరీలుగా విభజించి వివరాలు సేకరించాలని పార్టీ నేతలను కోరారు. తొలుత క్యాడర్‌ అభిప్రాయాలకు విరుద్ధంగా అభ్యర్థులను ఎంపిక చేయడం వల్ల ఓడిపోయిన స్థానాలను గుర్తించాలని సూచించారు. ఎమ్మెల్యేల పనితీరు సరిగా లేక పరాజయం ఎదురైన స్థానాలు రెండో విభాగం కింద విభజించారు. కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపంతో ఓడిపోయిన స్థానాలు మూడో విభాగంగా గుర్తించాలన్నారు. వైసీపీకి సంస్థాగతంగా బలం ఉండటం వల్ల ఓటమి ఎదురైన స్థానాలు నాలుగో విభాగంగా నమోదు చేయాలని సూచించారు.

పరిషత్‌ ఎన్నికల్లో కూటమి ఓటమికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నట్లు విశ్లేషణలు చెబుతున్నాయి. కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటులో లోపాలు ఒక కారణమని తెలుస్తోంది. గెలిచే అవకాశమున్న పార్టీకి కాకుండా, కోటా ప్రాతిపదికన బలహీనమైన పార్టీకి కొన్ని స్థానాలు కేటాయించడం, బలహీన అభ్యర్థులను బరిలోకి దించడం వంటివి ప్రభావం చూపినట్లు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు వైసీపీ నుంచి ఇంతటి పోటీ ఎదురవుతుందని కూటమి అంచనా వేయలేకపోయిందని, ఆ పార్టీ క్షేత్రస్థాయి బలం కూడా కొన్ని చోట్ల ఫలితాలను ప్రభావితం చేసిందని విశ్లేషణలు పేర్కొంటున్నాయి.

నాలుగు అంశాలపై నివేదికలు అందిన తర్వాత లోకేశ్‌ వాటిని పరిశీలించి, లోపాలను సరిదిద్దే చర్యలు చేపట్టే అవకాశం ఉంది.
Advertisement

సంబంధిత వార్తలు

మీ కోసం మరిన్ని

Nara LokeshAP Local Body ElectionsTDP AllianceYSRCPMPTC ZPTC Election ResultsAndhra Pradesh Politics

More Telugu News

ఐరన్ మ్యాన్ స్ఫూర్తితో 'జార్విస్'.. ఇంటర్నెట్ లేకుండానే పనిచేసే స్మార్ట్ రూమ్.. భారతీయ కుర్రాడి అద్భుత సృష్టి!

12 Nov, 14:12

యూఎస్ వీసా రూల్స్ మార్పు ప్రతిపాదన.. తీవ్రంగా వ్యతిరేకిస్తున్న మిచిగన్ యూనివర్సిటీ

12 Nov, 13:58

శ్రీకాళహస్తి ఆలయంలోని అన్నప్రసాద పోటులో అగ్నిప్రమాదం.. భారీగా చెలరేగిన మంటలు

12 Nov, 13:46

కేరళంలో కలకలం రేపుతున్న షిగెల్లా బ్యాక్టీరియా.. మలప్పురంలో హై అలర్ట్

12 Nov, 13:44

అభివృద్ధిలో మోదీ-బాబుది 'ఆర్ఆర్ఆర్' జోడీ.. సీఎం చంద్రబాబుపై గోయెల్ ప్రశంసల వర్షం

12 Nov, 13:39

సీఐఐ సదస్సులో ఏపీపై పారిశ్రామికవేత్తల ప్రశంసల జల్లు.. కియా రూ. 18 వేల కోట్ల పెట్టుబడి ప్రకటన

12 Nov, 13:27

21 సిక్సర్లతో విరుచుకుపడ్డ కివీస్ బ్యాటర్.. లిస్ట్-ఏ క్రికెట్‌లో రికార్డు ఇన్నింగ్స్

12 Nov, 13:23

అరకు కాఫీ రుచి చూసిన పీయూష్, చంద్రబాబు, పవన్ కల్యాణ్.. సీఐఐ సదస్సు ఫొటోలు ఇవిగో!

12 Nov, 13:16

యాక్ట్‌ ఫైబర్‌నెట్‌ వినియోగదారులకు గుడ్‌న్యూస్‌.. 500 ఎంబీపీఎస్‌ వరకు ఉచిత అప్‌గ్రేడ్

12 Nov, 13:13

ఏపీని మీ కార్పోరేట్ హోంగా మార్చుకోండి.. పారిశ్రామికవేత్తలకు ఫోన్ కాల్ దూరంలో ఉంటాం: మంత్రి లోకేశ్‌

12 Nov, 13:01

మైనర్‌పై అఘాయిత్యం.. మెదక్ పోక్సో కోర్టు సంచలన తీర్పు

12 Nov, 12:45

దేశీయ బ్యాంకులకు భారీ లాభాలు.. మూడు నెలల్లో రూ.1.16 లక్షల కోట్లు

12 Nov, 12:44

డోలు వాయించిన చంద్రబాబు, పీయూష్ గోయల్, పవన్ కల్యాణ్.. సీఐఐ సమ్మిట్ ఫొటోలు ఇవిగో

12 Nov, 12:29

ఎన్విడియా సీఈఓ జెన్సన్‌ హువాంగ్‌ను నియమించుకోవడం గౌరవంగా భావిస్తా: ఎలాన్‌ మస్క్‌

12 Nov, 12:27
..More Telugu News