Advertisement

వైట్‌కాలర్‌ జాబ్స్‌కు ఏఐ ముప్పు.. బ్లూకాలర్‌కు ఢోకా లేదు: సీఎం రేవంత్‌

Telangana
Advertisement
  • విద్య, ఉపాధి అవకాశాలకు ప్రత్యేక ప్రాధాన్యమిస్తున్నామన్న రేవంత్‌
  • ఐటీఐలను అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ సెంటర్లుగా మారుస్తున్నామని వెల్లడి
  • విద్య, నీటిపారుదలకు నెహ్రూ బలమైన పునాదులు వేశారని వ్యాఖ్య
  • మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ కృషి వల్లే భారతీయులు ప్రపంచ ప్రఖ్యాత సంస్థల్లో ఉన్నారని వెల్లడి
  • మైనారిటీల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని హామీ
తెలంగాణలో విద్య, ఉపాధి అవకాశాల మెరుగుదలకు తమ ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యమిస్తోందని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. యువతలో నైపుణ్యాలు పెంచేందుకు ఐటీఐలను అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ సెంటర్లుగా (ఏటీసీ) మారుస్తున్నామని చెప్పారు. ఆధునిక వసతులతో స్కిల్‌ యూనివర్సిటీ నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. బంజారాహిల్స్‌లోని సేవాలాల్‌ బంజారా భవన్‌లో నిర్వహించిన జాతీయ విద్య, మైనార్టీల సంక్షేమ దినోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

దేశంలో విద్య, నీటిపారుదల రంగాల అభివృద్ధికి తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ బలమైన పునాదులు వేశారని సీఎం పేర్కొన్నారు. మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ను తొలి విద్యాశాఖ మంత్రిగా నియమించి, యూనివర్సిటీలు, ఐఐటీల ఏర్పాటుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం కృషి చేసిందన్నారు. ఆ ప్రయత్నాల ఫలితంగానే భారతీయులు ప్రపంచ ప్రఖ్యాత సంస్థల్లో ఉన్నత స్థానాలకు చేరుకుంటున్నారని చెప్పారు.

సాంకేతికత వేగంగా మారుతున్న నేపథ్యంలో కంపెనీల అవసరాలకు అనుగుణంగా యువత తమ నైపుణ్యాలను పెంచుకోవాలని సూచించారు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) ప్రభావంతో వైట్‌కాలర్‌ ఉద్యోగాలకు ముప్పు పొంచి ఉందని, బ్లూకాలర్‌ ఉద్యోగాలకు మాత్రం ఆ ప్రమాదం లేదని అభిప్రాయపడ్డారు. మరోవైపు మైనార్టీలకు విద్య, ఉద్యోగాల్లో 4 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత కాంగ్రెస్‌దేనని గుర్తుచేశారు. విద్యార్థులకు స్కాలర్‌షిప్‌ల విషయంలో బీజేపీ రాజకీయాలు చేస్తోందని విమర్శించారు.

మైనార్టీలకు ఇచ్చిన హామీ మేరకు అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇచ్చామని రేవంత్‌రెడ్డి తెలిపారు. క్రికెటర్‌ సిరాజ్‌కు డీఎస్పీ ఉద్యోగం కల్పించామని గుర్తుచేశారు. మీరాలం చెరువుపై రూ.600 కోట్లతో కేబుల్‌ బ్రిడ్జి నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. మూసీ అభివృద్ధి పూర్తయితే పాతబస్తీకి పర్యాటకుల రాక పెరుగుతుందని, నగరంలో నైట్‌ ఎకానమీకి ఊతం లభిస్తుందని చెప్పారు. ఎస్‌ఐఆర్‌ పేరుతో పేదలు, మైనార్టీలు, ఎస్టీల ఓట్లు తొలగిస్తున్నారని బీజేపీపై ఆరోపణలు చేశారు. వచ్చే ఎన్నికల్లో మోదీని ఓడించడమే కాంగ్రెస్‌ లక్ష్యమని స్పష్టం చేశారు.
Advertisement

సంబంధిత వార్తలు

మీ కోసం మరిన్ని

Revanth ReddyArtificial Intelligence jobsTelangana Skill UniversityWhite collar vs Blue collar jobsMinority welfare TelanganaAdvanced Technology Centers

More Telugu News

ప్రియుడ్ని పెళ్లాడిన 'ఇరుముడి' హీరోయిన్ ప్రియా భవానీ శంకర్

11 Nov, 16:25

ఏపీకి మరో వాయుగుండం ముప్పు.. ఈ తేదీల్లో వర్షాలు కురిసే ఛాన్స్‌!

11 Nov, 16:25

9వ తరగతి పరీక్షల్లో బాగా రాశాడని కొడుక్కి బీఎండబ్ల్యూ కారు.. తండ్రి గిఫ్ట్ చూసి షాకైన జనం!

11 Nov, 16:23

సిద్ధూ జొన్నలగడ్డ కొత్త సినిమా ప్రారంభం.. నిర్మాతగా సుకుమార్‌!

11 Nov, 16:05

కూటమికి కూడా విడాకులు తప్పేలా లేవు: పవన్ కల్యాణ్ వైవాహిక జీవితంపై తులసిరెడ్డి

11 Nov, 15:59

ఎత్తిపోతల పునరుద్ధరణకు రూ.632 కోట్లు.. ఖరీఫ్ నాటికి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు సిద్ధం కావాలి: సీఎం చంద్రబాబు

11 Nov, 15:46

హెలికాప్టర్ నడిపిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి.. వీడియో వైరల్

11 Nov, 15:43

అమిత్ షా విశాఖ పర్యటన రద్దు

11 Nov, 15:43

కశ్మీర్‌లో ఉగ్ర కాల్పులు.. ముగ్గురు సీఆర్పీఎఫ్‌ జవాన్లకు గాయాలు

11 Nov, 15:41

విశాఖ ఇమ్మిగ్రేషన్ సేవలు రద్దు.. ఇక అంతా భోగాపురం నుంచే!

11 Nov, 15:39

కోల్‌కతా-ముంబై ఎయిర్ ఇండియా విమానంలో హైజాక్ బెదిరింపు

11 Nov, 15:22

అమెరికాలో కొత్త వివాదం.. ట్రంప్ 'విజయ తోరణం'పై కోర్టుకెక్కిన కెన్నెడీ ఫ్యామిలీ

11 Nov, 15:13

విడాకులు కాకముందే పెళ్లి చేసుకుంటానంటూ వేధింపులు.. హైదరాబాద్‌లో వ్యక్తిపై కేసు నమోదు

11 Nov, 15:11

అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల పేరిట నకిలీ క్యూఆర్ కోడ్ మోసం.. ట్రస్ట్‌పై కేసు

11 Nov, 15:00
..More Telugu News