అమెరికాలో విదేశీ టెకీలకు ఎదురుదెబ్బ.. వీసాలపై ఐబీఎం కీలక నిర్ణయం
Advertisement
- ఐబీఎం కన్సల్టింగ్ విభాగంలో వీసా, గ్రీన్ కార్డ్ స్పాన్సర్‌షిప్‌ల నిలిపివేత
- ట్రంప్ ప్రభుత్వ కఠిన నిబంధనల నేపథ్యంలో ఈ నిర్ణయం
- ప్రభావిత ఉద్యోగులు అమెరికా బయట పనిచేయాలి లేదా వైదొలగాలి
- గత నెలలో ఇన్ఫోసిస్, టీసీఎస్ వంటి సంస్థలపైనా ఇలాంటి ఆంక్షలు
- నైపుణ్యాలు, క్లయింట్ల అవసరాలు మారడమే కారణమంటున్న కంపెనీ
ప్రముఖ టెక్ దిగ్గజం ఐబీఎం అమెరికాలో పనిచేస్తున్న విదేశీ ఉద్యోగులకు షాకిచ్చింది. తన కన్సల్టింగ్ విభాగంలోని మెజారిటీ ఉద్యోగాలకు ఇకపై యూఎస్ వీసా, గ్రీన్ కార్డ్ స్పాన్సర్‌షిప్‌లు అందించబోమని ప్రకటించింది. లక్షన్నర మందికి పైగా ఉద్యోగులున్న ఐబీఎం కన్సల్టింగ్ విభాగం తీసుకున్న ఈ నిర్ణయం, టెక్ రంగంలో పనిచేస్తున్న విదేశీ నిపుణులలో ఆందోళన రేపుతోంది.
డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం విదేశీ టెక్ నిపుణుల నియామకాలపై కఠినంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఐబీఎం ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. గత నెలలోనే మైక్రోసాఫ్ట్, అడోబ్, ఇన్ఫోసిస్, టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి సంస్థలను 'పర్మనెంట్ లేబర్ సర్టిఫికేషన్' ప్రక్రియ నుంచి ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఇది విదేశీ ఉద్యోగులకు గ్రీన్ కార్డులు జారీ చేయడంలో కీలకమైన దశ.
గత కొన్నేళ్లుగా తమ సంస్థలో నైపుణ్యాల కొరతను తీర్చడానికి యూఎస్ వీసా ప్రోగ్రామ్‌లను ఉపయోగించుకున్నప్పటికీ, క్రమంగా వాటిపై ఆధారపడటం తగ్గిందని ఐబీఎం ప్రతినిధి ఒకరు 'రాయిటర్స్'కు తెలిపారు. ప్రస్తుతం మార్కెట్లో నైపుణ్యాల లభ్యత పెరగడం, క్లయింట్ల అవసరాలు మారడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వివరించారు.
'బ్లూమ్‌బర్గ్' నివేదిక ప్రకారం.. ఈ నిర్ణయంతో ప్రభావితమైన ఉద్యోగులు ఈ ఏడాది చివరిలోగా అమెరికా వెలుపల ఉన్న ఐబీఎం కార్యాలయాలకు బదిలీపై వెళ్లడం లేదా ఉద్యోగం నుంచి వైదొలగడం వంటివి చేయాల్సి ఉంటుంది. గతేడాది ట్రంప్ ప్రభుత్వం కొత్త హెచ్-1బీ పిటిషన్లపై లక్ష డాలర్ల ఫీజు విధించిన సంగతి తెలిసిందే.