మోదీ బస్తర్ ప్రసంగంపై రాహుల్ వ్యాఖ్యలకు బీజేపీ కౌంటర్.. రాంచందర్ రావు తీవ్ర విమర్శలు
Advertisement
- సాయుధ దళాలను గౌరవించడంలో కాంగ్రెస్, రాహుల్ వరుసగా విఫలమవుతున్నారన్న రాంచందర్ రావు
- నక్సల్స్ హింసను గానీ, పుల్వామా దాడిని గానీ ఖండించే ధైర్యం రాహుల్‌కు లేదని విమర్శ
- విదేశాలకు పారిపోకుండా పార్లమెంట్‌కు వచ్చి చర్చలో పాల్గొనాలని సూచన
ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ పర్యటనలో ప్రధానమంత్రి మోదీ చేసిన ప్రసంగంపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దేశ సాయుధ దళాలు, పారామిలిటరీ బలగాలు, సైన్యాన్ని గౌరవించడంలో కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ వరుసగా విఫలమవుతూనే ఉన్నారని ఆయన విమర్శించారు. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
బస్తర్ ప్రాంతంలో విధి నిర్వహణలో ఉన్న సీఆర్‌పీఎఫ్ జవాన్లతో కలిసి ప్రధాని నరేంద్ర మోదీ దీపావళి వేడుకలు జరుపుకుని వారిలో నైతిక స్థైర్యాన్ని నింపారని రాంచందర్ రావు పేర్కొన్నారు. అయితే గతంలో బస్తర్ ప్రాంతంలో సీఆర్‌పీఎఫ్ జవాన్లు అమరులైనప్పుడు ఆ ఘటనలను కాంగ్రెస్ పార్టీ ఏనాడూ ఖండించలేదని దుయ్యబట్టారు. బస్తర్‌లో నక్సలైట్ల హింసను గానీ, పుల్వామాలో జవాన్ల వీరమరణాన్ని గానీ, ఉగ్రవాద దాడులను గానీ ఖండించే ధైర్యం రాహుల్ గాంధీకి ఎన్నడూ లేదని, కనీసం బాధితులకు సానుభూతి కూడా తెలపలేదని ఆరోపించారు.
ఇటీవల బస్తర్ పర్యటనలో మోదీ మాట్లాడుతూ... ఆయుధాలు పట్టిన నక్సలిజం అంతమవుతున్నప్పటికీ, వివిధ సంస్థల్లో చొరబడిన "మేధో నక్సల్స్" రూపంలో ఇంకా ముప్పు పొంచి ఉందని వ్యాఖ్యానించారు. దీనిపై రాహుల్ గాంధీ ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ... విపక్షాలను ప్రధాని నక్సల్స్‌గా ముద్రవేస్తున్నారని ఆరోపిస్తూ, దేశద్రోహి ఎవరో చర్చించేందుకు రావాలని బహిరంగ సవాల్ విసిరారు. ఈ సవాల్‌పై రామచందర్ రావు స్పందిస్తూ... రాహుల్ గాంధీ వియత్నాం, రష్యా, అమెరికా వంటి దేశాలకు పారిపోకుండా, నేరుగా పార్లమెంట్‌కు వచ్చి ప్రజాస్వామ్యబద్ధంగా చర్చలో పాల్గొనాలని హితవు పలికారు.