ఇరాన్‌పై మరోసారి దాడి చేస్తారా? ట్రంప్‌ సమాధానం ఇదే..

International
Advertisement
  • ఇరాన్‌పై కొత్త దాడులు జరిగే అవకాశం తక్కువన్న ట్రంప్
  • అణు ఒప్పందం, హర్మూజ్‌ జలసంధిపై చర్చలు కీలకమని వ్యాఖ్య
  • మూడు విమాన వాహక నౌకలు యుద్ధానికి సిద్ధంగా ఉన్నట్లు వెల్లడి
  • ఇరాన్‌లో 38 వంతెనలు, విద్యుత్ కేంద్రాలు తమ లక్షాల పరిధిలో ఉన్నట్లు ప్రకటన
  • ఉద్రిక్తతల తగ్గింపునకు గల్ఫ్ దేశాల దౌత్య ప్రయత్నాలు
ఇరాన్‌పై మరోసారి యుద్ధం చేయాల్సిన అవసరం రాకపోవచ్చని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభిప్రాయపడ్డారు. అణు కార్యక్రమం, హర్మూజ్‌ జలసంధి పునఃప్రారంభంపై చర్చలు సానుకూలంగా సాగితే కొత్తగా సైనిక దాడులు చేసే అవకాశాలు చాలా తక్కువని చెప్పారు. అయితే అమెరికాతో బలమైన ఒప్పందానికి ఇరాన్ అంగీకరించకపోతే మాత్రం మరోసారి సైనిక చర్యలకు వెనుకాడబోమని హెచ్చరించారు.

సీఎన్‌ఎన్‌కు ఆదివారం ఇచ్చిన 20 నిమిషాల ఫోన్ ఇంటర్వ్యూలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. చర్చలు ముందుకు సాగితే యుద్ధం అవసరం ఉండకపోవచ్చని పలుమార్లు స్పష్టం చేశారు. ఇప్పటికే ఇరాన్‌పై అమెరికా సైనికంగా, ఆర్థికంగా తీవ్ర ప్రభావం చూపిందని పేర్కొన్నారు. ఇరాన్‌లో ద్రవ్యోల్బణం 301 శాతానికి చేరిందని వ్యాఖ్యానించారు.

మరోవైపు అవసరమైతే ఇరాన్‌పై మళ్లీ దాడులు చేసేందుకు అమెరికా సైన్యం సిద్ధంగా ఉందని ట్రంప్ వెల్లడించారు. ప్రస్తుతం పశ్చిమాసియాలో మూడు విమాన వాహక నౌకలు మోహరించి ఉన్నాయని చెప్పారు. అవి పూర్తిస్థాయిలో యుద్ధానికి సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు.

ఇరాన్‌లోని విద్యుత్ కేంద్రాలు, వంతెనలు సహా కీలక మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపారు. తమ వద్ద 38 వంతెనల వివరాలు ఉన్నాయని, గంటలో వాటిని ధ్వంసం చేయగలమని హెచ్చరించారు. అయితే వాటిని నాశనం చేయడం తనకు ఇష్టం లేదన్నారు. తిరిగి నిర్మించుకోవడానికి పదేళ్లు పట్టవచ్చని అభిప్రాయపడ్డారు.

ఇటీవల అమెరికా మధ్యంతర ఎన్నికల్లో ట్రంప్ రిపబ్లికన్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలిన నేపథ్యంలో పశ్చిమాసియాలో దౌత్య ప్రయత్నాలు ఊపందుకున్నాయి. ఉద్రిక్తతలు తగ్గించేందుకు ఖతార్‌ రాజు షేక్ తమీమ్ బిన్ హమద్ అల్‌ థానీతో ట్రంప్ చర్చించినట్లు ఖతార్ వెల్లడించింది.

ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ.. సౌదీ అరేబియా, యూఏఈ, ఒమన్, పాకిస్థాన్ సహా పలు దేశాల ప్రతినిధులతోనూ చర్చలు జరిపారు. అయితే అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో మాత్రం చర్చల్లో తక్షణ పురోగతి కనిపించడం లేదన్నారు. ఇరాన్ డిమాండ్లు ఆమోదయోగ్యం కానివిగా అభివర్ణించారు.

అమెరికా దాడులతో ఇరాన్ వైమానిక రక్షణ వ్యవస్థలు ధ్వంసమయ్యాయని ట్రంప్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ దేశం వద్ద కేవలం 10 శాతం క్షిపణి సామర్థ్యం, 15 శాతం డ్రోన్ల సామర్థ్యం మాత్రమే మిగిలాయని అన్నారు. ఆయుధ తయారీ కేంద్రాలు కూడా చాలావరకు దెబ్బతిన్నాయని చెప్పారు. ఇరాన్ ఒప్పందానికి ఆసక్తిగా ఉందని, అందువల్ల మరోసారి యుద్ధం వచ్చే అవకాశం తక్కువేనని ట్రంప్ అభిప్రాయపడ్డారు.
Advertisement

సంబంధిత వార్తలు

మీ కోసం మరిన్ని

Donald TrumpIran US conflictMiddle East tensionsIran nuclear programStrait of HormuzMarco Rubio

More Telugu News

వైభవ్ సూర్యవంశీకి అదిరిపోయే గిఫ్ట్‌.. ఐపీఎల్‌ ప్రైజ్‌గా ఖరీదైన కారు

09 Nov, 10:38

దీపావళి వేళ ముంబైలో 89 అగ్నిప్రమాదాలు.. ఒకరి బలి

09 Nov, 10:37

జెన్-జీ వాడుకలో 'మాగింగ్'.. ఏంటి దీని స్పెషాలిటీ?.. అసలు ఈ పదం ఎలా పుట్టింది?

09 Nov, 10:34

పార్లమెంట్ ప్రోరోగ్‌లో రికార్డు జాప్యం.. ప్రత్యేక భేటీ కోసమేనా?

09 Nov, 10:19

హైదరాబాద్‌పై కాలుష్య పంజా.. ఢిల్లీతో పోటీపడుతున్న భాగ్యనగరం!

09 Nov, 10:14

యూత్ ను ఆకట్టుకునే 'నూరుకోడి వానవిల్'

09 Nov, 10:12

దీపావళి విషాదం.. టపాసుల దెబ్బకు హైదరాబాద్‌లో శాశ్వతంగా చూపు కోల్పోయిన వ్యక్తి

09 Nov, 10:11

ఏడాది పాటు భారత్‌లో.. చివరిరోజు విదేశీయుడి భావోద్వేగ సందేశం

09 Nov, 10:07

దీపావళి రోజున కుమ్మేసిన 'రామాయణ'

09 Nov, 10:07

భర్త తప్పుతో వార్తల్లోకి లోరీ మిల్స్.. వారి ప్రేమకథ మీకు తెలుసా?

09 Nov, 09:57

చైనాలో తీవ్రమవుతున్న రుణ సంక్షోభం.. అప్పుల ఊబిలో 10 కోట్ల మంది!

09 Nov, 09:42

చదరంగంలో భారత్ చారిత్రక శతకం.. 100వ గ్రాండ్‌మాస్టర్‌గా అనుజ్ శ్రీవత్రి

09 Nov, 09:39

అక్కడే 'సీన్' మారిపోయింది .. లేదంటే హిట్ పడేదే!

09 Nov, 09:35

చంద్రకోర తిలకం ధరించి కూతురితో కలిసి రేణూ దేశాయ్ దీపావళి

09 Nov, 09:31
..More Telugu News