‘మురసు’ పెను విలయం: ఏపీలో 8 మంది బలి, రూ.1918 కోట్ల నష్టం
Advertisement
- లక్షలాది హెక్టార్లలో వ్యవసాయ, ఉద్యాన పంటలు ధ్వంసం
- తుపాను నష్టంపై సీఎం చంద్రబాబు సమీక్ష
- సహాయక చర్యలు వేగవంతం చేయాలని ఆదేశం
- నేడు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్న సీఎం
- యుద్ధప్రాతిపదికన విద్యుత్, రహదారుల పునరుద్ధరణ పనులు
Advertisement
ఆంధ్రప్రదేశ్‌ను ‘మురసు’ తుపాను పెను విపత్తులో ముంచేసింది. మంగళవారం తీరం దాటిన ఈ తుపాను ధాటికి రాష్ట్రవ్యాప్తంగా 8 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రాథమిక అంచనాల ప్రకారం సుమారు రూ.1,918.55 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేశారు. బాపట్ల జిల్లాలో ఐదుగురు, గుంటూరు జిల్లాలో ఇద్దరు, పల్నాడు జిల్లాలో ఒకరు మరణించినట్లు అధికారికంగా ధ్రువీకరించారు.
తుపాను కారణంగా రాష్ట్రంలో వ్యవసాయ రంగం తీవ్రంగా దెబ్బతిన్నది. సుమారు 1,86,063 మంది రైతులకు సంబంధించి 1,43,122 హెక్టార్లలో పంటలకు నష్టం వాటిల్లింది. అలాగే 12,586 మంది రైతులకు చెందిన 6,749 హెక్టార్లలో ఉద్యాన పంటలు ధ్వంసమయ్యాయి. వీటితో పాటు 983 ఇళ్లు, 346 పడవలు, 220 చేపల వలలు కూడా దెబ్బతిన్నట్లు అధికారులు నివేదికలో పేర్కొన్నారు.
సహాయక చర్యలపై చంద్రబాబు సమీక్ష
గురువారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ‘మురసు’ తుఫాను అనంతర పరిస్థితిపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. వ్యవసాయం, విద్యుత్, పురపాలక, పంచాయతీరాజ్ శాఖల్లో జరిగిన నష్టం గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. వరద నీరు తగ్గిన తర్వాత పంట నష్టాన్ని కచ్చితంగా అంచనా వేయడానికి 48 నుంచి 72 గంటల సమయం పడుతుందని అధికారులు సీఎంకు వివరించారు. వరుస తుపానులతో రైతులు, ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చూడాలని, విద్యుత్ పునరుద్ధరణ, రహదారుల మరమ్మతులు, తాగునీటి సరఫరాకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని చంద్రబాబు ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పరిస్థితిని అంచనా వేసేందుకు శుక్రవారం తాను స్వయంగా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నట్లు ప్రకటించారు.
యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ పనులు
తుపాను ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరణ పనులు వేగంగా జరుగుతున్నాయని అధికారులు సీఎంకు తెలిపారు. ఏపీసీపీడీసీఎల్ పరిధిలో దెబ్బతిన్న 1,103 ఫీడర్లకు గాను 871 ఫీడర్లను పునరుద్ధరించగా, 3,946 విద్యుత్ స్తంభాలకు గాను 1,493 స్తంభాలను సరిచేశారు. ఆర్ అండ్ బీ శాఖ పరిధిలో 760 కిలోమీటర్ల మేర రాష్ట్ర రహదారులు, ప్రధాన జిల్లా రహదారులు దెబ్బతిన్నాయి. చెట్లు కూలిన 206 ప్రదేశాలలో వాటిని తొలగించారు. పంచాయతీరాజ్ శాఖ పరిధిలో 74 గ్రామీణ రహదారులు దెబ్బతినగా, వాటి మరమ్మతులకు రూ.92.08 కోట్లు అవసరమని అంచనా వేశారు.
రాష్ట్రవ్యాప్తంగా 31,428 టెలికాం టవర్లలో 30,518 టవర్లు పనిచేయడం ప్రారంభించాయని, 97.1 శాతం సేవలు పునరుద్ధరించబడ్డాయని అధికారులు తెలిపారు. సహాయక చర్యల్లో 11 ఎస్‌డీఆర్ఎఫ్, 13 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, 390 మంది అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు. తక్షణ సాయం కింద ప్రభుత్వం జిల్లాలకు రూ.37 కోట్లు విడుదల చేసింది. వీలైనంత త్వరగా ప్రభావిత ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయి. ప్రకాశం బ్యారేజీ వద్ద 43,500 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లో కొనసాగుతుండగా, తమ్మిలేరుకు వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది.