స్టార్‌లింక్ నియంత్రణ మస్క్ చేతుల్లో ఉండకూడదు.. నోబెల్ గ్రహీత కీలక వ్యాఖ్యలు
Advertisement
- స్టార్‌లింక్ నియంత్రణ మస్క్ నుంచి తప్పించాలని క్రుగ్‌మన్ వ్యాఖ్య
- జాతీయ భద్రతపై ప్రైవేటు వ్యక్తుల నిర్ణయాలు ప్రభావం చూపకూడదని అభిప్రాయం
- కీలక సాంకేతిక వ్యవస్థలపై ప్రభుత్వ నియంత్రణ అవసరమని క్రుగ్‌మన్ వాదన
- ఉక్రెయిన్ యుద్ధంలో స్టార్‌లింక్ కీలక పాత్ర
- డ్రోన్ల నిర్వహణ, సైనిక సమాచారానికి ఉపగ్రహ ఇంటర్నెట్ వినియోగం
Advertisement
ప్రపంచ కుబేరుడు, స్పేస్‌ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ చేతుల్లో ఉన్న స్టార్‌లింక్ నియంత్రణను ఆయన నుంచి తప్పించాలని నోబెల్ బహుమతి గ్రహీత, ప్రముఖ ఆర్థికవేత్త పాల్ క్రుగ్‌మన్ అభిప్రాయపడ్డారు. ఓ ప్రైవేటు వ్యక్తి నిర్ణయాలు ఓ దేశ భద్రతపై ప్రభావం చూపే స్థాయిలో ఉండకూడదని స్పష్టం చేశారు. స్టార్‌లింక్ ఇప్పుడు కేవలం ఇంటర్నెట్ సేవ మాత్రమే కాదని, యుద్ధంలో కీలకమైన సైనిక సాంకేతిక వ్యవస్థగా మారిందని పేర్కొన్నారు.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో స్టార్‌లింక్ సేవల ప్రాధాన్యంపై వాల్‌స్ట్రీట్ జర్నల్ ప్రచురించిన కథనం నేపథ్యంలో క్రుగ్‌మన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్ సైన్యం స్టార్‌లింక్ సేవలను ఎప్పుడు? ఎలా? ఉపయోగించాలనే విషయంలో మస్క్ తీసుకునే నిర్ణయాలు యుద్ధంపై నేరుగా ప్రభావం చూపుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి కీలక నిర్ణయాలు వ్యాపారవేత్తల చేతుల్లో కాకుండా ప్రభుత్వాల పరిధిలో ఉండాలని పేర్కొన్నారు.
2022లో రష్యా ఉక్రెయిన్‌పై దాడి చేసిన తర్వాత అక్కడి కమ్యూనికేషన్ వ్యవస్థలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఆ సమయంలో స్టార్‌లింక్ ద్వారా ఆసుపత్రులు, ప్రభుత్వ కార్యాలయాలు, విద్యుత్ కేంద్రాలకు ఇంటర్నెట్ సదుపాయం అందింది. ఆ తర్వాత ఉక్రెయిన్ సైన్యం డ్రోన్ల నిర్వహణకు, యుద్ధరంగంలో సమాచార మార్పిడికి ఈ వ్యవస్థను ఉపయోగించడం ప్రారంభించింది. దీంతో స్టార్‌లింక్ ఉక్రెయిన్ రక్షణలో కీలక పాత్ర పోషిస్తోంది.
అయితే, స్టార్‌లింక్‌ను ప్రమాదకర దాడుల కోసం ఉపయోగించడానికి అనుమతి లేదని మస్క్ వాదిస్తున్నారు. ఉక్రెయిన్ సైన్యం సేవా నిబంధనలను ఉల్లంఘించి దాడులకు ఉపయోగిస్తోందని ఆరోపించారు. పౌర అవసరాల కోసం అందించే స్టార్‌లింక్, సైనిక అవసరాల కోసం రూపొందించిన స్టార్‌షీల్డ్ వేర్వేరు సేవలని కూడా ఆయన స్పష్టం చేశారు. స్టార్‌షీల్డ్ వినియోగంపై అమెరికా ప్రభుత్వానిదే నియంత్రణ అని పేర్కొన్నారు.
ఉక్రెయిన్ సైన్యం స్టార్‌లింక్‌పై అధికంగా ఆధారపడటం ఆ దేశానికి బలంతో పాటు బలహీనతగా కూడా మారిందని క్రుగ్‌మన్ అభిప్రాయపడ్డారు. జాతీయ భద్రతకు కీలకమైన వ్యవస్థపై నిర్ణయాధికారం ఒక్క వ్యక్తి చేతుల్లో ఉండటం సరికాదని, ప్రభుత్వం ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని సూచించారు.