మా అమ్మాయి వివాహం యలహంక ఇంట్లో జరగడం లేదు.. వేదిక మార్పుపై షర్మిల కీలక ప్రకటన

Andhra
Advertisement
  • కుమార్తె అంజిలి వివాహ వేదికను మార్చిన వైఎస్ షర్మిల
  • వివాదాలకు దూరంగా ఉండేందుకే ఈ నిర్ణయమని వెల్లడి
  • యలహంక ఇంట్లో కాకుండా వేరే చోట పెళ్లి వేడుక
  • పెరిగిన ఇంట్లో పెళ్లి కావాలన్న బిడ్డ ఆశను నెరవేర్చలేకపోతున్నానని ఆవేదన
  • ఆస్తి పంపకాల్లో ఆ ఇల్లు తనకే చెందిందని గతంలో జగన్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈ పరిణామం
Advertisement
ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన కుమార్తె అంజిలి రెడ్డి వివాహ వేదికను మారుస్తున్నట్లు కీలక ప్రకటన చేశారు. బెంగళూరులోని యలహంక నివాసంలో జరగాల్సిన పెళ్లి వేడుకను, వేరొక ప్రదేశంలో నిర్వహించనున్నట్లు ఆమె శనివారం సోషల్ మీడియా వేదికగా తెలిపారు. వివాదాలకు తావివ్వకుండా, ప్రశాంతంగా వివాహం జరిపించాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా షర్మిల తన ఆవేదనను పంచుకున్నారు. "నాది కాని దానికోసం ఆశపడే నీచత్వం నాది కాదు. జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక, అప్పటి వరకు ఉమ్మడి ఆస్తిగా ఉన్న యలహంక ప్రాపర్టీ.. ఆస్తుల పంపకాల్లో భాగంగా, పూర్తిగా 100 శాతం నాకు, నా పిల్లల భాగానికి వచ్చింది. ఇది దేవుడి సాక్షిగా నిజం" అని స్పష్టం చేశారు.

"నా బిడ్డల హక్కు కాబట్టి, నాన్న వైఎస్ఆర్ తిరిగిన ఇల్లు కనుక, నా కుమార్తె అంజిలి కోరినట్లుగా తన వివాహం అక్కడ చేయాలనుకున్నాం. మన తెలుగింట ఏ గుమ్మాన్ని అడిగినా చెప్తుంది.. సొంత ఇంట్లో బిడ్డ పెళ్లి చేయడం ప్రతి తల్లిదండ్రులకు అదృష్టమని. కానీ, తాను పెరిగిన ఇల్లే పెళ్లి వేదిక కావాలన్న నా బిడ్డ ఆకాంక్షను నెరవేర్చలేక పోయామని చాలా బాధపడుతున్నాం" అని ఆవేదన వ్యక్తం చేశారు.

"వివాహ వేదిక విషయంలో జరుగుతున్న పరిణామాలను చూసి, నా బిడ్డ గురించి బాధపడిన ప్రతి ఒక్కరికీ నా వందనం. నా కుమార్తె అంజిలి పెళ్లి..  పెద్దలు కుదిర్చిన సంబంధం. వివాద రహితంగా, ఎలాంటి  గొడవలు లేకుండా, వివాహం జరిపించాల్సిన బాధ్యత మా మీద ఉంది. అందుకే వైఎస్ అంజిలి రెడ్డి - సోమల రఘురామ్ రెడ్డిల పరిణయ వేడుకను యలహంక ఇంట్లో కాకుండా, వేరే ప్రదేశంలో బంధుమిత్రులు, ఆత్మీయుల సమక్షంలో నిర్వహించాలని నిశ్చయించుకున్నాం.  కాబోయే నవదంపతులకు తెలుగు ప్రజల ఆశీస్సులు, దీవెనలు ఉండాలని మనసారా ఆకాంక్షిస్తున్నాం" అని షర్మిల రాసుకొచ్చారు.  

కొంతకాలంగా యలహంక నివాసం విషయంలో సోదరుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి, షర్మిలకు మధ్య విభేదాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆస్తుల పంపకాల్లో భాగంగా ఆ ఇల్లు పూర్తిగా తనకే చెందిందని గతంలో జగన్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే, "నాది కాని దానికోసం ఆశపడే నీచత్వం నాది కాదు" అంటూ షర్మిల చేసిన పరోక్ష వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఇప్పుడు పెళ్లి వేదిక మార్పుతో కుటుంబంలోని విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి.
Advertisement

సంబంధిత వార్తలు

More Telugu News

ఫోన్‌లో డాక్యుమెంట్లు పెడుతున్నారా?.. ఈ తప్పులు అస్సలు చేయకండి!

31 Oct, 12:40

అమరావతికి చేరుకున్న కేంద్ర బృందం.. ఆర్నబ్ తుఫాన్ నష్టంపై సమీక్ష

31 Oct, 12:36

ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం.. ఫ్యాక్టరీలో నలుగురు సజీవ దహనం

31 Oct, 12:29

హైదరాబాద్‌లో హైడ్రా చర్యలు.. రామాంతపూర్ పెద్ద చెరువు వద్ద కూల్చివేతలు

31 Oct, 12:25

స్కూల్‌లో దారుణం.. పదో తరగతి విద్యార్థినిపై చెట్లు కోసే మెషీన్‌తో పాశవిక దాడి!

31 Oct, 12:24

చలి మొదలవుతోంది.. రోజువారీ అలవాట్లలో ఈ 7 మార్పులు చేసుకోండి!

31 Oct, 12:12

ఫైవ్‌స్టార్‌ హోటల్‌ స్విమ్మింగ్‌ పూల్‌లో కరెంట్‌ షాక్‌.. ఇద్దరు విదేశీయులు మృతి

31 Oct, 12:11

స్కూల్లో షాకింగ్ ఘ‌ట‌న‌.. బాలికపై బాలుడి పాశవిక దాడి.. స్పృహ కోల్పోయినా వదల్లేదు!

31 Oct, 12:09

తేని జైలు ఘటనపై సీఎం విజయ్ సీరియస్.. అధికారులకు కీల‌క ఆదేశాలు

31 Oct, 12:08

ప్రభుత్వ బ్యాంకును ప్రైవేటుకు అప్పగిస్తారా?: ఐడీబీఐ డీల్‌పై కేటీఆర్ ఫైర్

31 Oct, 12:08

తాజ్‌మహల్ వద్ద కుటుంబంతో అద్నాన్ సామీ.. ప్రేమకు ప్రతిరూపం అంటూ పోస్ట్!

31 Oct, 12:07

బాలయ్య-కొరటాల సినిమాపై వదంతులు.. క్లారిటీ ఇచ్చిన టీం

31 Oct, 11:48

మధ్యంతర ఎన్నికల్లో పరాభవం ఎదురైతే ఇరాన్‌కు మూడినట్లేనా? ట్రంప్‌ ప్లాన్స్‌ ఏంటి?

31 Oct, 11:43

అనిరుధ్-కావ్య మారన్ వివాహం.. మొదలైన పెళ్లి సందడి!

31 Oct, 11:41

విద్యుత్ పునరుద్ధరణకు సాయం చేయండి.. తమిళనాడును కోరిన ఏపీ

31 Oct, 11:39
..More Telugu News