- కేజీ బేసిన్‌లోని రవ్వా ఆయిల్ ఫీల్డ్ వద్ద నిలిచిపోయిన సిగ్మా పెరల్
- ఇంజిన్ ఫెయిల్యూర్ కావడమే ఘటనకు కారణంగా గుర్తింపు
- రంగంలోకి దిగిన కోస్ట్ గార్డ్.. సుజయ్ నౌకతో సహాయక చర్యలు
‘అర్నబ్’ తుపాను ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ఈ తుపాను కారణంగా విశాఖపట్నం నుంచి సింగపూర్‌కు వెళ్తున్న ఒక భారీ కార్గో నౌక సముద్రంలో చిక్కుకుపోయింది. ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో ఆ నౌక ముందుకు కదలలేని స్థితిలో నిలిచిపోయింది.
వివరాల్లోకి వెళితే.. మార్షల్ ఐలాండ్స్‌కు చెందిన ‘సిగ్మా పెరల్’ అనే కార్గో నౌక విశాఖ పోర్టులో సరుకును అన్‌లోడ్ చేసిన అనంతరం సింగపూర్‌కు బయలుదేరింది. మార్గమధ్యంలో కేజీ బేసిన్‌లోని రవ్వా ఆయిల్ ఫీల్డ్ సమీపానికి చేరుకోగానే, తుపాను ప్రభావంతో ఎగిసిపడుతున్న భీకరమైన అలల ధాటికి నౌక ఇంజిన్ ఆగిపోయింది. దీంతో అప్రమత్తమైన సిబ్బంది వెంటనే అధికారులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న భారత తీర రక్షక దళం (కోస్ట్ గార్డ్) అధికారులు తక్షణమే సహాయక చర్యలు ప్రారంభించారు. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు కేంద్రంగా ఈ ఆపరేషన్‌ను పర్యవేక్షిస్తున్నారు. నౌకలో చిక్కుకున్న సిబ్బందిని రక్షించేందుకు ‘సుజయ్’ అనే కోస్ట్ గార్డ్ నౌకను ఘటనా స్థలానికి పంపించారు. ప్రస్తుతం సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.