సౌందర్య గురించి చెబుతూ కన్నీటిపర్యంతమైన నటి ఆమని
Advertisement
- మేకప్ లేకపోయినా సౌందర్య దేవతలా ఉండేదన్న ఆమని
- కోట్లు సంపాదించినా తన కలలు నెరవేర్చుకోలేకపోయిందని ఆవేదన
- బెంగళూరులోని ఆమె ఇల్లు చూసి బాధపడ్డానని వెల్లడి
Advertisement
దివంగత నటి సౌందర్యను తలుచుకుని సీనియర్ నటి ఆమని తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో, సౌందర్యతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. సౌందర్య అందం, వ్యక్తిత్వం గురించి మాట్లాడుతూ, ఆమె జీవితంలో ఎదుర్కొన్న ఒంటరి పోరాటాన్ని వివరించారు.
"చాలామంది ముఖానికి మేకప్ వేస్తేనే తెరపై అందంగా కనిపిస్తారు. కానీ సౌందర్య మాత్రం ఎలాంటి మేకప్ లేకపోయినా అచ్చం దేవతలా ఉండేది. ఆమె నిజంగానే ఓ దేవత. అంత అందంగా ఉండేది కాబట్టేనేమో, ఆ దేవుడు కూడా అంత తొందరగా ఆ దేవతల్లోనే కలిపేసుకున్నాడు" అంటూ ఆమని కన్నీటిపర్యంతమయ్యారు. సినీ రంగంలో ఉన్నప్పటికీ, "'నేను ఇలాగే ఉంటాను.. నాకంటూ ఒక పద్ధతి ఉంది' అని ఒక గిరి గీసుకుని ఉండేది" అని ఆమని తెలిపారు.
సౌందర్య ఎంతో అమాయకురాలని, ఆమె వ్యవహారాలన్నీ తొలుత ఆమె తండ్రి, ఆయన మరణం తర్వాత అన్నయ్య చూసుకునేవారని ఆమని గుర్తుచేసుకున్నారు. కష్టపడి కోట్లు సంపాదించినా, భర్త, పిల్లలతో సంతోషంగా జీవించాలనే తన కలలు నెరవేరకుండానే వెళ్లిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల బెంగళూరులోని సౌందర్య ఇంటికి వెళ్లానని, ఒకప్పుడు కళకళలాడిన ఆ ఇల్లు పాడుబడినట్టు కనిపించడంతో తన గుండె తరుక్కుపోయిందని ఆమని చెప్పారు. దక్షిణాది ప్రేక్షకులచే మహానటిగా కీర్తించబడిన సౌందర్య, చిన్న వయసులోనే హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే.