మాట్లాడదామని పిలిచి.. మాజీ ప్రియురాలిని చంపి, కాల్చేసిన యువకుడు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మాట్లాడదామని పిలిచి.. మాజీ ప్రియురాలిని చంపి, కాల్చేసిన యువకుడు!

Youth calls ex girlfriend to talk then kills and burns her body
  • కేరళలోని ఇడుక్కిలో 18 ఏళ్ల యువతి దారుణ హత్య
  • మాజీ ప్రియుడే నిందితుడని తేల్చిన పోలీసులు
  • గొంతు నులిమి, బండరాయితో కొట్టి చంపినట్లు వెల్లడి
  • సాక్ష్యాలు చెరిపేందుకు మృతదేహాన్ని పెట్రోల్ పోసి దహనం
  • నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
కేరళలోని ఇడుక్కి జిల్లాలో అత్యంత దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. ప్రేమ విఫలమైందన్న కారణంతో ఓ యువకుడు తన మాజీ ప్రియురాలిని అత్యంత కిరాతకంగా హతమార్చాడు. గొంతు నులిమి, బండరాయితో కొట్టి చంపిన తర్వాత, సాక్ష్యాలు నాశనం చేసేందుకు మృతదేహానికి నిప్పు పెట్టాడు. ఈ ఘాతుకానికి పాల్పడిన 19 ఏళ్ల నిశాంత్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తమిళనాడులోని బోడినాయకనూర్‌కు చెందిన నిత్య (18), కేరళలోని రాజకుమారి ప్రాంతానికి చెందిన నిశాంత్ (19) 2023 నుంచి ప్రేమించుకున్నారు. అయితే, కొంతకాలం తర్వాత వారి మధ్య మనస్పర్థలు రావడంతో విడిపోయారు. ఈ క్రమంలో, తమ సంబంధం గురించి మాట్లాడదామని అక్టోబర్ 11న నిశాంత్.. నిత్యను పూపారా ప్రాంతానికి పిలిపించాడు.

మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో పూపారాలోని ఓ తేయాకు తోటలో ఇద్దరూ కలుసుకున్నారు. మాటల మధ్యలో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆవేశానికి లోనైన నిశాంత్, తొలుత నిత్య గొంతు నులిమాడు. అనంతరం బండరాయితో ఆమె తలపై పలుమార్లు మోది అక్కడికక్కడే హతమార్చాడు.

అంతటితో ఆగని నిశాంత్, నేరాన్ని కప్పిపుచ్చేందుకు ప్రయత్నించాడు. హత్య జరిగిన కొన్ని గంటల తర్వాత అదే రోజు రాత్రి 10 గంటల సమయంలో తిరిగి ఘటనా స్థలానికి చేరుకున్నాడు. నిత్య మృతదేహాన్ని తన ఆటోరిక్షాలో ఎక్కించుకుని పంబళ డ్యామ్ సమీపంలోని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లాడు. వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను మృతదేహంపై పోసి నిప్పంటించాడు.

మరుసటి రోజు కాలిపోయిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు. ఘటన తర్వాత నిశాంత్ తన మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పారిపోయాడు. సాంకేతిక ఆధారాలతో పోలీసులు అతడిని రాజకుమారి ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు. హత్యకు దారితీసిన పూర్తి కారణాలపై విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.
Advertisement
Nishanth
Nithya
Idukki crime
Kerala murder
Poopara tea plantation
Pambla Dam

More Telugu News