కల్వకుంట్ల కుటుంబాన్ని గతంలో తిట్టి.. ఇప్పుడు పొగడ్తలా?: జీవన్ రెడ్డిపై అడ్లూరి లక్ష్మణ్ ఫైర్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కల్వకుంట్ల కుటుంబాన్ని గతంలో తిట్టి.. ఇప్పుడు పొగడ్తలా?: జీవన్ రెడ్డిపై అడ్లూరి లక్ష్మణ్ ఫైర్

Adluri Laxman fires at Jeevan Reddy for praising Kalvakuntla family after criticizing them earlier
  • బీఆర్ఎస్ నేత జీవన్ రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆగ్రహం
  • పార్టీ మారగానే కల్వకుంట్ల కుటుంబం మంచిదైపోయిందా అని ప్రశ్న
  • ఎండిన ఒక్క పొలమైనా చూపించాలని జీవన్ రెడ్డికి సవాల్
బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి పార్టీ మారినంత మాత్రాన... ఒకప్పుడు ఆయన తీవ్రంగా విమర్శించిన కల్వకుంట్ల కుటుంబం ఇప్పుడు మంచిదైపోయిందా? అని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సూటిగా ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మంత్రి తీవ్రంగా స్పందించారు. ఈరోజు జగిత్యాల అర్బన్ కాలనీలో 33/11 కేవీ నూతన విద్యుత్ సబ్-స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనంతరం మంత్రి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 

గతంలో కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు జీవన్ రెడ్డి... కేసీఆర్, కేటీఆర్‌తో పాటు కల్వకుంట్ల కుటుంబంపై తీవ్ర విమర్శలు చేశారని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందని ఆరోపించిన జీవన్ రెడ్డి... ఇప్పుడు పార్టీ మారగానే వారంతా సత్యవంతులుగా కనిపిస్తున్నారా? అని నిలదీశారు.

విద్యుత్ సమస్యలపై సాధారణ ఆరోపణలు చేయడం కాదని, నీళ్లు లేక ఎండిపోయిన ఒక్క పొలాన్నయినా చూపించాలని జీవన్ రెడ్డికి సవాల్ విసిరారు. ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ, జీవన్ రెడ్డిని కేబినెట్‌లోకి తీసుకుంటామని స్వయంగా ముఖ్యమంత్రే ప్రతిపాదించిన విషయాన్ని గుర్తు చేసుకోవాలని చెప్పారు.

రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నామని, ఎల్ నినో ప్రభావంతో రైతులు నష్టపోకుండా ఉండేందుకు విద్యుత్ సరఫరాను రేవంత్ రెడ్డి స్వయంగా పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
Advertisement
Adluri Laxman
Jeevan Reddy
Kalvakuntla family
Revanth Reddy
Telangana Politics
BRS Congress conflict

More Telugu News