చంద్రబాబు, నారా లోకేశ్ ప్రోద్బలంతోనే దాడి జరిగింది: పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
- పుంగనూరులో నామినేషన్ల వేళ తీవ్ర ఉద్రిక్తత
- ఎంపీ మిథున్ రెడ్డి కాన్వాయ్‌పై దాడి జరిగిందన్న పెద్దిరెడ్డి
- మిథున్ రెడ్డికి ఏమైనా జరిగితే ప్రభుత్వానిదే బాధ్యత అని స్పష్టీకరణ
స్థానిక ఎన్నికల నామినేషన్ల తొలిరోజే పుంగనూరులో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య చెలరేగిన ఘర్షణ హింసాత్మకంగా మారింది. ఈ క్రమంలో రాజంపేట వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి కాన్వాయ్‌పై దాడి జరిగిందంటూ ఆయన తండ్రి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు.
ఎన్నికలకు నామినేషన్లు దాఖలు చేసేందుకు వైసీపీ అభ్యర్థులు వెళుతుండగా ఘర్షణ జరిగింది. బసవరాజ జూనియర్ కాలేజీ సమీపంలో టీడీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో గుమిగూడి వైసీపీ శ్రేణులను అడ్డుకున్నారని, ఆ తర్వాత ఎంపీ మిథున్ రెడ్డి కాన్వాయ్‌పై రాళ్లు, కర్రలతో దాడి చేశారని వైసీపీ నేతలు ఆరోపించారు. ఈ దాడిలో పలు వాహనాలు ధ్వంసం అయ్యాయి.
ఈ ఘటనపై మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్రంగా స్పందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ ప్రోద్బలంతోనే పథకం ప్రకారం ఈ దాడి జరిగిందని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తోందని, పోలీసులు టీడీపీ కార్యకర్తలతో కుమ్మక్కై తమ అభ్యర్థులను అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. మిథున్ రెడ్డికి ఏమైనా జరిగితే ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ ఘర్షణలతో పుంగనూరులో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది.